Begin typing your search above and press return to search.
తొమ్మిదేళ్ల బాలిక పై VRA అఘాయిత్యం!
By: Tupaki Desk | 31 Aug 2020 4:30 AM GMTబాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కొందరు కామంతో ఏంచేస్తున్నామో అన్న సంగతి కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. కామాంధుల కబంధ హస్తాలకు పసిమొగ్గలు వాలిపోతున్నాయి. అభయం శుభం తెలియని చిన్నారులను కీచకులు చిదిమేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి కఠిన చట్టాలు తీసుకువచ్చిన కాలరాస్తూ.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లా మైలవరం లో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జక్కా నాగమునయ్య, తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలవరం ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ ఆదివారం తెలిపారు.
పోలీసులు, స్థానికుల వివరాల మేరకు నాగమునయ్య ఇంటికి సమీపంలోని ఓ వీధిలో శనివారం సాయంత్రం బాలిక ఆడుకుంటుండగా ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి సమీపం లో ఉన్న ఓ గుడి ఆవరణంలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేసాడు. ఆ బాలిక గట్టిగా కేకలు వేయడం తో పాటు ఏడుపులు వినపడటంతో అటుగా వెళ్తున్న ఓ మహిళ గమనించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నాగమునయ్య ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. రాత్రి బాలిక కడుపు నొప్పి తీవ్రంగా ఉందని చెప్పడంతో వైద్య పరీక్షల నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి చనిపోవడంతో అతడి స్థానంలో 2006 నుంచి వీఆర్ ఏ గా నాగమునయ్య పనిచేస్తున్నాడు. నాగమునయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మైలవరం, లింగాపురం పంచాయతీలకు వీఆర్ ఏ నాగమునయ్య ఒక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగమునయ్య పై ఐపీసీ సెక్షన్ 354(ఏ) 376 సెక్షన్ తో పాటు ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాగా, మునెయ్య ను కఠినం గా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.