Begin typing your search above and press return to search.

ఏపీలో 80 శాతాన్ని రీచ్ కానున్న పోలింగ్?

By:  Tupaki Desk   |   11 April 2019 10:51 AM IST
ఏపీలో 80 శాతాన్ని రీచ్ కానున్న పోలింగ్?
X
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంది. పోలింగ్ రోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉండటం విశేషం. సినిమా టికెట్ల కోసం క్యూల్లో ఉండటానికి ఇష్టపడని వారు.. ఓటు విషయంలో మాత్రం ఎంతో ఉత్సాహంగా క్యూ లైన్లకు పేరుకొంటున్నారు.

ఉదయం పూట భారీగా పోలింగ్ నమోదు అవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఏపీలో పోలింగ్ శాతం ఎనభైని చేరేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఆరు శాతం పోలింగ్ నమోదు అయినట్టుగా ఉంది. ఈ సారి ఆ శాతం మరింత పెరగడం అయితే ఖాయంగా కనిపిస్తూ ఉంది. పెరిగే పోలింగ్ శాతం ఎన్నికల ఫలితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంని చెప్పవచ్చు.

అందులోనూ ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటూ ఎంతో కీలకం అవుతుంది. నాలుగైదు శాతం ఓట్ల పోలింగ్ పెరిగిందంటే.. ఫలితాలు మరింత ఆసక్తిని రేపుతాయి. ఈ సారి యువ ఓటర్ల నమోదు బాగానే పెరిగింది. ఆ ప్రభావం కూడా పోలింగ్ శాతం మీద ప్రభావం చూపవచ్చు.

ఇక పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీ పై వ్యతిరేకతకు నిదర్శనం అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఓటర్లు ఉత్సాహవంతంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. అక్కడి వరకూ అభినందించి తీరాల్సిందే!