Begin typing your search above and press return to search.

మూడు జిల్లాల కోసం.. జ‌గ‌న్ ఇలాచేస్తున్నారే!

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:00 AM GMT
మూడు జిల్లాల కోసం.. జ‌గ‌న్ ఇలాచేస్తున్నారే!
X
రాజ‌కీయాల్లో వ్యూహాలు ఉండొచ్చు.. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు.. ప్ర‌తివ్యూహాలు కూడా ఉండొచ్చు. కానీ, ఈ వ్యూహాలు.. ఎంత వ‌ర‌కు మేలు చేస్తాయ‌నేది ప్ర‌శ్న‌. కేవ‌లం మూడు జిల్లాల్లో ఓట్ల కోసం.. గ‌త ఎన్నిక‌ల్లో చేసిన క్లీన్ స్వీప్‌ను మ‌రోసారి ద‌క్కించుకుని.. రికార్డును తిర‌గ‌రాయాల‌నేది..వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇది మంచిదే. అయితే.. దీనికోసం.. రాష్ట్రం మొత్తాన్ని నాశ‌నం చేయాల్సిన అవ‌స‌రం లేదు క‌దా.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

మూడు రాజ‌ధానుల అజెండాను ఎంచుకున్న వైసీపీ ప్ర‌భుత్వానికి.. ఎక్కడా కూడా మ‌ద్ద‌తు రాలేదు. రాజ‌ధాని రైతుల‌కు వ‌స్తున్న‌.. వ‌చ్చిన మ‌ద్ద‌తు తో పోలిస్తే.. క‌నీసం.. 0.01% కూడా మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తు రాలేదు.

అలాంటి స‌మ‌యంలో కూడా త‌మ‌దే పైచేయి అన్న‌ట్టుగా.. వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదంతా ఎందుకు? అంటే.. కేవ‌లం శ్రీకాకుళం, క‌ర్నూలు, నెల్లూరు కోస‌మే. ఈ మూడు జిల్లాల్లో.. దాదాపు వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది.

నెల్లూరు రెడ్డి సామాజిక వ‌ర్గం మొత్తం గెలుపు గుర్రం ఎక్కింది. టీడీపీ మాత్రం ప్ర‌కాశంలో నాలుగు చోట్ల గెలిచింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఈ రికార్డును ద‌క్కించుకోవాల‌న్న‌ది వైసీపీ వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ మూడు ప్రాంతాల్లోనూ రాజ‌ధానుల‌ను పెట్ట‌డం ద్వారా.. ఆయా జిల్లాల్లో త‌న హ‌వాను కాపాడుకుని.. వేరే పార్టీకి ఓట్లు లేకుండా చేయాల‌నేది వ్యూహం. కానీ, రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా వేరేగా ఉంది. ఎంత క్లీన్ స్వీప్ చేసినా.. కూడా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌లు మార‌తార‌ని చెబుతున్నారు.

అంటే.. వైసీపీ స‌ర్కారు కోరుకున్న విధంగా మాత్రం ప‌రిస్థితి ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ఇక‌, ఈ వంక‌తో.. అంటే.. ఈ మూడు జిల్లాల్లో క్లీన్ స్వీప్ రికార్డును నిల‌బెట్టుకునేందుకు మిగిలిన ప‌ది జిల్లాల ప్ర‌జ‌ల‌ను, వ్యాపారుల‌ను కూడా వైసీపీ నిలువునా.. ముంచేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండ‌డాన్ని.. ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల‌తోపాటు.. ఉభ‌య గోదావ‌రి, ప్ర‌కాశం జిల్లాల వారు.. కోరుకుంటున్నారు.

అదేస‌మ‌యంలో క‌ర్నూలులో న్యాయ‌రాజధాని ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ‌కు క్లీన్ స్వీప్ రికార్డుతిర‌గ‌రాస్తార‌ని అనుకుంటున్న వైసీపీ వ్యూహం.. క‌లిసి వ‌చ్చినా.. క‌డ‌ప‌.. అనంత‌పురం, చిత్తూరు ప్ర‌జ‌ల‌కు విశాఖ‌లో పాల‌నా రాజ‌ధానికి వెళ్లేందుకు.. మ‌రిన్ని వ్య‌వ‌ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు.ఇక‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఏదైనా ప‌నిపై హైకోర్టుకు వెళ్లాలంటే.. క‌ర్నూలు వ‌ర‌కు వెళ్లాల్సింది. ఎటొచ్చీ.. మిగిలిన ప‌ది జిల్లాల‌కు వైసీపీ స‌ర్కారు నిర్ణ‌యం.. గొడ్డ‌లి పెట్టుగా మారింద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.