Begin typing your search above and press return to search.
కర్నాటకలో ఓట్ల బదిలీలో భారీ మార్పు .. ఎస్ఏఎస్ గ్రూప్ సంచలన సర్వే
By: Tupaki Desk | 28 April 2023 4:39 PM GMTకర్నాటకలో అసలు ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ మేమే వస్తామని గట్టిగా చెబుతోంది. కాంగ్రెస్ మేము గెలుస్తామని జబ్బలు చరుస్తోంది. జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించాలనుకుంటోంది. ఏ పార్టీకి మెజారిటీ రాదని అనేక సర్వేలు చెబుతున్న వేళ శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ సర్వే మాత్రం ఫుల్ మెజారిటీతో కాంగ్రెస్ మరి కొద్ది రోజులలో అధికారంలోకి వస్తుందని కుండబద్ధలు కొట్టింది.
కర్నాటకలో కాంగ్రెస్ కే అన్ని అవకాశాలు ఉన్నాయని కూడా లోతైన విశ్లేషణలతో కూడిన తన సర్వే నివేదికని బయటపెట్టింది. ఈ సర్వే ఎన్నికలకు అతి కొద్ది రోజులు ఉన్న ఈ కీలక సమయంలో బయటకు వచ్చింది. ఒక విధంగా ఓటర్ల మనోగతాన్ని అద్దం పట్టింది అని భావించాలి. ఈ సర్వే ప్రకారం చూస్తే బీజేపీ గతంలో వచ్చిన ఓట్లను బాగా కోల్పోతుంది అని కూడా పేర్కొంది.
ఒక్కసారి 2018లోకి వెళ్తే అప్పట్లో బీజేపీకి 36.35 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి అది 35 శాతానికి తగ్గిపోతుంది అని ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కి గత ఎన్నికల్లో 38.14 శాతం ఓట్లు వస్తే ఈసారి అది కాస్తా 41.5 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా కట్టింది.
అంటే ఏకంగా 3.36 శాతం పెరుగుదల అన్న మాట. జేడీఎస్ కి గత ఎన్నికల్లో18.3 శాతం ఓట్లు వస్తే ఈసారికి అది కాస్తా 16.5 కి పడిపోతుందని పేర్కొంది. ఇతరులకు 7.21 శాతం ఓట్లు అపుడు వస్తే ఇపుడు ఏడు శాతానికే పరిమితం అవుతారని లెక్క తేల్చింది. అంటే కేవలం కాంగ్రెస్ కి మాత్రమే ఈ ఎన్నికల్లో ఓట్ల పెరుగుదల ఉందని తేలుతోంది.
అదే విధంగా బెంగుళూరు అర్బన్ లో బీజేపీకి 37 శాతం, కాంగ్రెస్ కి 41.5 శాతం, జేడీఎస్ కి 16 శాతం, ఇతరులకు 5.5 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. ఓల్డ్ మైసూరులో బీజేపీకి 18 శాతం, కాంగ్రెస్ కి 37 శాతం, జేడీఎస్ కి 37.5 శాతం, ఇతరులకు 7.5 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ముంబై కర్నాటక లో బీజేపీకి 39 శాతం, కాంగ్రెస్ కి 44 శాతం, జేడీఎస్ కి తొమ్మిది శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.
అలాగే కోస్టల్ కర్నాటకలో బీజేపీకి 43 శాతం, కాంగ్రెస్ కి 41.5 శాతం, జేడీఎస్ కి 8.5 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వస్తాయని అంచనా కట్టింది. హైదరాబాద్ కర్నాటకలో చూస్తే బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్ కి 44 శాతం, జేడీఎస్ కి 15 శాతం, ఇతరులకు ఆరు శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. సెంట్రల్ కర్నాటకలో చూస్తే బీజేపీకి 38 శాతం, కాంగ్రెస్ కి 41 శాతం, జేడీఎస్ కి 13 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది.