Begin typing your search above and press return to search.

సోమవారం రాత్రికే ఓటేసే టైంను మీడియాతో షేర్ చేసుకున్న సెలబ్రిటీలు

By:  Tupaki Desk   |   1 Dec 2020 4:15 AM GMT
సోమవారం రాత్రికే ఓటేసే టైంను మీడియాతో షేర్ చేసుకున్న సెలబ్రిటీలు
X
సాధారణంగా స్థానిక ఎన్నికలకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. తాజాగా పరిస్థితి మారింది. గతంలో ఎప్పుడూ లేనంత పోటాపోటీగా ఈసారి స్థానిక ఎన్నికలు రణరంగాన్నితలపించేలా సాగాయి. మాటల యుద్ధంతో పాటు.. పూర్తి స్థాయి భావోద్వేగ వాతావరణంలో ఎన్నికలు జరగటం ఈసారి ప్రత్యేకతగా చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలతో పాటు.. రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల సమయంలో సినీ.. క్రీడా ప్రముఖులు.. సెలబ్రిటీలు ఓటేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు.

స్థానిక ఎన్నికలప్పుడు ఓటు వేయటం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా మాత్రం సినీ..క్రీడా తారలు.. పలువురు సెలబ్రిటీలు తాము ఓటు వేసే వివరాల్ని సోమవారం రాత్రి నాటికే మీడియాతో పంచుకున్నారు. పలువురు టాలీవుడ్ తారలు..తాము ఓటు వేసే కేంద్రంతో పాటు.. టైంను వెల్లడించారు.

తమతో పాటు తమ కుటుంబ సభ్యులమంతా కలిసి వస్తామన్నవివరాల్ని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉదయాన్నే మీడియాకు సమాచారం అందించారు. అందుకు భిన్నంగా స్థానిక ఎన్నికల వేళ.. ముందు రోజు రాత్రే మీడియా మొత్తానికి తాము ఓటువేసే టైంను.. ప్లేస్ ను సెలబ్రిటీలు వెల్లడించటం గమనార్హం.