Begin typing your search above and press return to search.
పవన్ పై కేసు పెట్టిన వాలంటీర్లు
By: Tupaki Desk | 10 July 2023 9:13 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి రెండో విడత యాత్ర సంచలనాలకు వేదికగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
పవన్ పై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. పవన్ పై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ వైసీపీ నేతలు మొదలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. మహిళల మిస్సింగ్ కేసులపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఇవ్వాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది.
ఇక, పవన్ పై అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో కూడా వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అంతేకాదు పవన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ పరువు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమపై నిందలు వేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని వారు వాపోయారు.
తామేం చేస్తున్నామో పవన్ చూశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల పవన్ దిష్టిబొమ్మను వాలంటీర్లు దగ్ధం చేశారు. మరోవైపు పవన్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు.
వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, డైలాగ్స్ కొట్టడం ఆయన అలవాటుగా మారిందని విమర్శించారు సీఎం సీటు కోసం ఎవరినైనా పణంగా పెడతారా అని ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్ గురించి ఆయనకు కేంద్రంలోని ఏ అధికారి చెప్పారో తమకు తెలియజేయాలని, పవన్ వ్యాఖ్యలు మహిళలు భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు.