Begin typing your search above and press return to search.

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌తో పార్టీకి న‌ష్ట‌మే.. పీకే టీమ్ రిషి రిపోర్ట్‌

By:  Tupaki Desk   |   13 Jun 2022 2:30 PM GMT
వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌తో పార్టీకి న‌ష్ట‌మే.. పీకే టీమ్ రిషి రిపోర్ట్‌
X
2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని న‌మ్మి పార్టీకి 151 సీట్లు ఇచ్చారు ఏపీ ప్ర‌జ‌లు. దీంతో టీడీపీ నేల‌కు దిగి వ‌చ్చే ట‌ట్టు చేశాడు. ఆ త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం ఏర్పడింది. ఇక, వైసీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు ఇస్తే.. ఓట్ల షేరింగ్ శాతం పెరుగుతుంద‌నే అంచ‌నా వేసుకుని.. అప్పులు చేసి మ‌రీ సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నారు. అయితే.. ఆ ఓట్లు సాలిడ్‌గా వ‌స్తున్నాయ‌ని.. వ‌లంటీర్ రిపోర్టులు ఇస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఆ విధంగా లేద‌నేది స‌మాచారం.

ఉదాహ‌ర‌ణ‌కు అమ్మ ఒడి, విద్యా దీవెన డ‌బ్బులు తీసుకుని.. మందు షాపుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. మంచి మందు ఇవ్వ‌డం లేదు.. రేట్లు పెంచాడు అని జ‌గ‌న్ తిడుతున్నారు. దీనిని బ‌ట్టి వ‌లంటీర్ లు ఇస్తున్న‌ రిపోర్టులు .. వారు ఇవ్వ‌డం లేద‌ని.. తెలుస్తోంది. మొన్న క‌ర్నూలు జిల్లాలో ఒకావిడ ఎమ్మెల్యేను అమ్మ ఒడి రాలేద‌ని అంటే.. ''అమ్మ ఒడి వ‌స్తే.. మీ ఆయ‌న‌ను మందు షాపుకు పంపిస్తావా?'' అని ఎగ‌తాళి చేసే ప‌రిస్థితి వ‌చ్చింది.

అంటే.. ఎమ్మెల్యేల‌కు కూడా నేరుగా డ‌బ్బులు ఇవ్వ‌డం లేదు. ఎందుకంటే.. వాళ్లు గ‌డ‌ప గ‌డ‌ప‌కు వెళ్తే.. అమ్మ ఒడి వ‌చ్చింద‌ని.. ప‌థ‌కాల ద్వారా.. డ‌బ్బులు వ‌చ్చాయ‌ని.. చెబితే.. అవి ప‌ట్టించుకోకుండా.. స‌మ‌స్య‌లు చెబుతున్నారు. అంటే.. ప‌థ‌కాల డ‌బ్బులు కావాలి.. అభివృద్ధి కావాలి.. అని వాళ్లు అయ్యారన్న మాట‌. ప్ర‌భుత్వంతో పీకే టీమ్ ఒప్పందం కుదిరాక‌.. ముందు సొంత‌గా ఒక స‌ర్వే చేసుకున్నారు. ప‌థ‌కాల మీద‌. అయితే.. వాటి వ‌ల్ల జ‌గ‌న్ కు పాజిటివ్ వ‌చ్చిన ఎమ్మెల్యే మీద వ్య‌తిరేకత ఉంది.

వైసీపీ కేడ‌ర్ మొత్తం.. ఎమ్మెల్యేల మీద వ్య‌తిరేకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు మాత్రం మేం ఏం చేయాలి..? జ‌గ‌న్ ఇవ్వ‌డం లేదు.. మాకు అధికారం లేదు. అంతా వ‌లంటీర్ల‌కి ఇస్తున్నారు.. మేం ఏం చేయాల‌ని.. ప్ర‌శ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అయితే.. క‌నీసం ప‌ది మందికి పింఛ‌న్ తెచ్చే అధికారం కూడా మా ద‌గ్గ‌ర లేద‌ని చెప్పేస్తున్నారు. ఎంత దారుణంగా ఉందో.. అని కేడ‌ర్‌కి జ‌గ‌న్ మీద నూరి పోస్తున్నారు. జ‌గ‌న్ నుంచి ఎమ్మెల్యేలు.. వారి నుంచి కేడ‌ర్ ఈక్వేష‌న్ స‌రిగాలేదు. ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా ఉన్నార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

అయితే.. పీకే టీం డీల్ కు రేటు మాట్లాడాలి అనేది తేల్చాల్సి ఉంద‌ని.. ప‌థ‌కాల మీద చేశారు. అయితే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్త మీద పొలిటిక‌ల్ నాయ‌కుల అంతా నెగిటివ్‌గా ఉంద‌ని, కేడ‌ర్ అంతా చెల్లాచెదురు అయింది. సోష‌ల్ మీడియా ఫేవ‌ర్ టీం అంతా ఇప్పుడు 'ఐటీడీపీ' టీంలో 25 వేల నుంచి 40 వేల వ‌ర‌కు జాయిన్ అయ్యారంట‌. అంద‌కే మంచి టీం అంతా 'ఐటీడీపీ' కి జాయిన్ అయింది. దీంతో మ‌న ప‌థ‌కాల‌కు ప్ర‌చారం రావ‌డం లేద‌ని.. అంటున్నారు.

ఒక్క వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను న‌మ్ముకుంటే.. లాభం లేద‌ని.. కేడ‌ర్‌ను కూడా హ్యాపీ చేసుకుంటేనే బాగుంటుం ద‌ని అంటున్నారు రేప‌టినాడు ఏజెంట్ల‌ను పెట్టేది.. గ్రామ నాయ‌కులే కాబ‌ట్టి.. త్వ‌ర‌లో ఒక నిర్ణ‌యం తీసుకుని కేడ‌ర్‌ను హ్యాపీ చేయ‌డం అనేది.. పీకే టీం వైఎస్ ప్రెసిడెన్సీ.. అయిన‌.. రిషి రాజ్ సింగ్ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అందుకే ఈ మ‌ధ్య జ‌రిగిన స‌మావేశంలో కూడా సీట్లు గ్యారెంటీ లేదని.. ఇండైరెక్ట్‌గా చెప్పాడ‌ని అంటున్నారు. అంటే.. చాలా మందికి సీట్లు లేవ‌ని.. ఒక ఏడాది ముందే.. వాళ్ల‌కు చెప్పి.. వాళ్ల ప్లేస్‌లో కొత్త‌గా ఇంచార్జ్‌ల‌ను తీసుకొని వ‌చ్చి కేడ‌ర్ ను బ‌లోప‌తేం చేస్తార‌ని అంటున్నారు.