Begin typing your search above and press return to search.

సీరమ్​ వ్యాక్సిన్​ పై వలంటీర్​ సంచలన ఆరోపణలు..భారీ జరిమానా విధిస్తామన్న సంస్థ..!

By:  Tupaki Desk   |   30 Nov 2020 11:10 AM GMT
సీరమ్​ వ్యాక్సిన్​ పై వలంటీర్​ సంచలన ఆరోపణలు..భారీ జరిమానా  విధిస్తామన్న సంస్థ..!
X
కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనదేశంలో కూడా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్​ తయారీలో ముందున్నాయి. ఇప్పటికే హైదరాబాద్​ కేంద్రంగా పనిచేస్తున్న భారత్​ బయోటెక్​ తీసుకొస్తున్న కోవాగ్జిన్​ అశాజనక ఫలితాలు ఇస్తోంది. మరోవైపు రెడ్డి ల్యాబ్స్​ కూడా రష్యాకు చెందిన స్పుత్నిక్​​-వీని అభివృద్ధి చేస్తున్నది. అయితే ఆక్స్​ఫర్డ్​ వర్సిటీతో కలిసి పూణేకు చెందిన సీరమ్​ ఇన్ ​స్టిట్యూట్​ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​ ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన క్లినికల్​ ట్రయల్స్​ ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్​ పై ఓ వలంటీర్​ సంచలన ఆరోపణలు చేశాడు. వ్యాక్సిన్​ వేయించుకున్నాక తనకు నాడీ సంబంధిత వ్యాధి వచ్చిందని సదరు వ్యక్తి ఆరోపించాడు.

ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంటనే సీరమ్​ ఇన్ ​స్టిట్యూట్​ క్లినికల్​ ట్రయల్స్​ నిలిపివేసి తనకు రూ. 5కోట్లు పరిహారం చెల్లించాలని సదరు వ్యక్తి ఆ సంస్థకు నోటీసులు పంపాడు. ఈ విషయం పలు మీడియాల్లో వచ్చింది. సోషల్​మీడియాలోనూ ప్రకంపణలు సృష్టించింది. అయితే దీనిపై సీరమ్​ సంస్థ స్పందించింది. వ్యాక్సిన్​ ప్రయోగానికి వలంటీర్ ఆరోగ్యపరిస్థితికి ఎలాంటి సంబంధం లేదని సీరమ్​ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమపై నిందలు వేస్తున్నారని సంస్థ ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసిన వాలంటీర్‌ పై వంద కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని వేస్తామని సంస్థ హెచ్చిరించింది.

ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చివరి దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సీరం ఇన్‌ స్టిట్యూట్‌ చీఫ్‌ అధర్‌ పూనావాలా చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీ - ప్రయోగ వివరాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం శనివారం సీరం ఇన్‌ స్టిట్యూట్‌ ను సందర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్​ భద్రతపై వలంటీరే స్వయంగా ఆరోపణలు చేయడం పెను సంచలనంగా మారింది. వలంటీర్​ ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది.