Begin typing your search above and press return to search.

వ‌లంటీరు : ఇక‌పై అంతా తానే అన్నీ తానే !

By:  Tupaki Desk   |   5 Aug 2022 5:30 PM GMT
వ‌లంటీరు : ఇక‌పై అంతా తానే అన్నీ తానే !
X
వ‌చ్చే ఎన్నిక‌లకు సంబంధించి ఇప్ప‌టి నుంచే కొన్ని స‌ర్వేలు చేయిస్తున్నారు అధికార పార్టీ నేత‌లు. ఇవ‌న్నీ ప్ర‌యివేటు సంస్థ‌ల‌తో చేయిస్తున్న‌వి. కానీ ప్ర‌భుత్వ సంస్థ‌ల త‌ర‌ఫున స‌ర్వేలు అన్న‌వి ఏమీ లేవు. కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టులు తప్ప ఇంత‌వ‌ర‌కూ ఏ విధ‌మ‌యిన స‌ర్వేలూ చేయించిన దాఖ‌లాలు లేవు.

ఇదే సంద‌ర్భంలో వ‌లంటీర్లతో ఓ సర్వే చేయించాల‌ని భావిస్తున్నారు సీఎం. సంక్షేమ ప‌థ‌కాల అమలుపై ల‌బ్ధిదారుల అభిప్రాయం తెలుసుకునేందుకు వీలుగా ప్ర‌స్తుతానికి ఓ సర్వే చేయించాల‌ని చూస్తున్నారు. కానీ వీటి వెనుక ఉద్దేశం మ‌రో విధంగా ఉంది.

మొద‌టి విడ‌త‌గా ఈ స‌ర్వే నిర్వ‌హించాక, ఎమ్మెల్యేల ప‌నితీరుపై మ‌రో విడ‌త‌లో చేయించాల‌ని సీఎం భావిస్తున్నారని స‌మాచారం.

అంటే ఈ లెక్క‌న వ‌లంటీర్ల చేతిలోనే ఎమ్మెల్యేల భ‌విష్య‌త్ కూడా ఆధార‌ప‌డి ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో వ‌లంటీర్ల‌తో భేటీ కావాల‌ని కూడా సీఎం భావిస్తున్నారు.

కొన్ని చోట్ల వలంటీర్లే అంతా తామై న‌డిపిస్తున్నా కూడా ఎమ్మెల్యేలు వారి హ‌వాను అడ్డుకోలేక‌పోవ‌డానికి కార‌ణం సీఎం వారికి ఇస్తున్న ప్రాధాన్య‌మే ! ఇటువంటి త‌రుణాన ప్ర‌తి యాభై ఇళ్ల‌కూ కేటాయించిన వ‌లంటీరు సామాజికంగానూ, రాజ‌కీయంగానూ మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశాలే ఉన్నాయి.

అందుకే కార్య‌క‌ర్త‌లు కూడా వలంటీర్ల తీరుపై మండిప‌డుతున్నారు. వాస్త‌వంగా స్థానికంగా వ‌లంటీర్లు బ‌ల‌పడుతున్న కొద్దీ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం అన్న‌ది లేకుండా పోతోంది. ఇదే ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంది. ఇక‌పై స‌ర్వేల పేరిట వారికి ఇంకొన్ని అధికారాలు ద‌క్కితే ఇక పెత్త‌నం అంతా వాళ్ల‌దే కావొచ్చు.