Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: వాలంటీర్ దారుణ హత్య

By:  Tupaki Desk   |   13 March 2021 2:59 AM GMT
బ్రేకింగ్: వాలంటీర్ దారుణ హత్య
X
అనంతపురం జిల్లాలో వాలంటీర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో వాలంటీర్ ను దుండగులు హతమార్చారు.

ఏపీలోని అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేటకు చెందిన వాలంటీర్ శ్రీకాంత్ రోజు మాదిరిగానే ఆఫీసు పనులు పూర్తి చేసుకొని పొలం పనులకు వెళ్లాడు.

అయితే అప్పటికే అక్కడ మాటువేసిన కొందరు గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం శ్రీకాంత్ ను హత్య చేశారు.

వాలంటీర్ శ్రీకాంత్ రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పొలం వద్ద చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? కారణాలేంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి పాతకక్షలా? ఇంకా ఏమైనా కారణాల అన్న దానిపై ఆరాతీస్తున్నారు.