Begin typing your search above and press return to search.
ఒక్కసారిగా బూడిదమేఘం.. ఉక్కిరిబిక్కిరైన స్థానికులు
By: Tupaki Desk | 6 Dec 2021 1:01 AM GMTరోజూలాగే అందరూ ఎవరి పనుల్లో వారు మునిగారు. అంతా ప్రశాంతంగా ఉన్న వాళ్లకు ఒక్కసారిగా కమ్ముకొస్తున్న బూడిద మేఘం కనిపించింది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన ఆ దుమ్ము చుట్టూఉన్న గ్రామాలకు విస్తరించింది. ఆ దూళి సూర్యరశ్మిని కమ్మేసింది. ఫలితంగా అంధకారం అలుముకుంది.
కమ్ముకొచ్చిన పొగతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 41మందికి గాయాలయ్యాయి. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సెమేరు అగ్నిపర్వతం సముద్రమట్టానికి 3,676 ఎత్తులో ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. అయితే ఇక్కడ తరుచూ ఈ బూడిద వెలువడుతుందని... శనివారం నాడు అది కాస్త ఎక్కువ మొత్తంలో విడుదలైందని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా 4,300 మీటర్ల ఎత్తువరకు వెళ్లే బూడిద... ఈసారి మరింత ఎక్కువ ఎత్తుకు వెళ్లిందని అంటున్నారు.
గతేడాది డిసెంబర్ లోనూ ఇది బద్దలైంది. భూకంపాలు రావడం తరుచూ జరుగుతుందని స్థానికులు వెల్లడించారు. అయితే బూడిద మేఘం రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరై భయంతో పరుగులు తీశారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సెమేరు అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ ఘటన సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతం ప్రభావంతో మలాంగ్ కు వెళ్లే దారిలో ఉన్న వంతెన, రహదారి ధ్వంసమయ్యాయి.
ఒక్కసారిగా కమ్ముకొచ్చిన పొగ ఎగిసిపడుతూ మబ్బులుగా హిందూ సముద్రం మీదుగా ప్రవహిస్తోందని పేర్కొన్నారు.
బూడిద పరిమాణంపై ఆస్ట్రేలియాలోని డార్విన్ వాల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ పరిశీలిస్తోంది. స్థానికంగా అలుముకున్న యాష్ పరిమాణంపై ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తోంది. బూడిద ఎక్కడ ఉంది ఏ దిశగా ప్రయాణిస్తుందన్న విషయాన్ని విమాన రంగానికి తెలియజేస్తోంది.
వాతావరణంలోని బూడిద 15 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఆవరిస్తే విమానాలను నిలిపివేయాలని ఓ అధికారి వెల్లడించారు. ఈ పొగ కారణంగా విమానాలు దారి మళ్లించాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక విమానాలు ఎక్కువ శాతం 15 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయని వివరించారు.
ఆ బూడిదలో విమానాలు ప్రయాణిస్తే ఇంజిన్లపై పేరుకుపోతుందని పేర్కొన్నారు. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చెప్పారు. పొగ వల్ల పైలట్లకు ఆకాశ మార్గం సరిగా కనిపించదని అన్నారు.
అంతేకాకుండా గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. అందుకే బూడిద కదలికలపై నిత్యం నిఘా ఉంచినట్లు తెలిపారు.