Begin typing your search above and press return to search.

ఈ ఏడాది ఖర్చులపై సామాన్యుల స్వరం ఇదే..!

By:  Tupaki Desk   |   5 Jan 2022 11:30 PM GMT
ఈ ఏడాది ఖర్చులపై సామాన్యుల స్వరం ఇదే..!
X
కరోనా వైరస్ దేశ ఆర్థిక స్థితి గతిని చాలా మార్చింది. మొదటి వేవ్ సమయంలో అన్నీ మన దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలింది. మార్కెట్ లో డబ్బు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ ప్రభావం సామాన్యుల మీద కూడా పడింది. చాలా మంది ప్రజలు రోడ్డున పడ్డారు. అనుకోని లాక్ డౌన్ తో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. మరి కొందరు అయితే వందల కిమీ ఏకంగా కాలి నడకన వెళ్లారు. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అప్పుడే ఉద్దీపన చర్యలను ప్రకటించింది. దీంతో మార్కెట్ లో మరలా వినిమయం పెరిగింది. ఇప్పుడిప్పుడు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకునే నేపథ్యంలో మరల వైరస్ విజృంభించింది. కేవలం కొన్ని రోజుల్లోనే ప్రపంచ దేశాలకు కొత్త వేరియింట్ ఒమిక్రాన్ సంగతి అవగతం అయ్యింది.

ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజలు ఖర్చు విషయంలో తిరిగి పునరాలోనచనలో పడ్డారు. ఇప్పటికే దెబ్బతిన్న కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ భూతం దాడి చేయడంతో మరింత కుంగారు. కొత్త ఏడాదిలో అయిన ఊపిరి పీల్చుకుని ఖర్చులు సాధారణ స్థితికి చేరుకుంటాయనుకునే లోపే కొత్త వేరియంట్ రావడం సామాన్యులను కలవరానికి గురి చేస్తుంది. కేసులు అమాంత పెరగడంతో మూడో వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా కుటుంబాలు తమ ఖర్చులను ఈ ఏడాది పరిమితం చేసుకోనున్నట్లు తేలింది. ఈ ఏడాదిలో వారు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం లేదని చెప్పినట్లు ఓ సర్వే సంస్థ తెలిపింది. చాలా కుటుంబాలు ఇదే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబానికి చెందిన చాలా మంది ఇదే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాదిలో వీరు భూములు కానీ, ఇల్లు కానీ, కారు లాంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడడం లేదని తెలిపింది. దేశంలోని ప్రతి ఐదు కుటుంబాల్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఇలాంటి ఆలోచన ఉందని సర్వే తెలిపింది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. 47 వేలకు పైగా కుటుంబాలు ఈ సర్వేలో భాగం అయ్యాయి. వీటిలో కుటుంబ పెద్ద మాటను ప్రమాణికంగా తీసుకుని ఈ సర్వేని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వేలో పాల్గొన్న 78 శాతానికి పైగా కుటుంబాలు 2022లో కొత్తగా నగలు కొనే ఆలోచనలో ఉన్నట్లుగా లేరని పేర్కొన్నారు. కేవలం కొంతమంది మాత్రమే భూములు, నగలు, వెహికల్స్ లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు.

ఈ ఏడాదిలో ఎక్కువమంది మదుపరులుగా మారనున్నట్లు సర్వే సంస్థ పేర్కొంది. చాలా మంది స్టాక్ మార్కెట్ లో, మ్యూచ్ వల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ విజృంభింస్తున్న నేపథ్యంలో బీమా తీసుకునే వారి సంఖ్య కేవలం 15 శాతానికి మాత్రమే పరిమితం అయ్యిందని సర్వే నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది డబ్బుల విషయంలో కొంచెం గట్టిగానే వ్యవహరిస్తారని సర్వే సంస్థ స్పష్టం చేసింది