Begin typing your search above and press return to search.

విశాఖ ఒక గొప్ప పారిశ్రామిక నగరంగా ఎదుగుతుంది .. వైసీపీ మంత్రి !

By:  Tupaki Desk   |   20 Dec 2019 10:01 AM GMT
విశాఖ ఒక గొప్ప పారిశ్రామిక నగరంగా ఎదుగుతుంది .. వైసీపీ మంత్రి !
X
ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతోంది. అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఏపీకి మూడు రాజధానులు రావచ్చు అని సంచలనమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనితో కొందరు దీనికి వ్యతిరేకంగా ఉన్నా కూడా చాలావరకు అభివృద్ధి అనేది అన్ని చోట్ల జరగాలి అని కోరుకుంటున్నారు. ఆలా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలి అంటే ..సీఎం జగన్ చెప్పినట్టుగానే మూడు రాజధానులు అనేది మంచి నిర్ణయం అని చెప్తున్నారు.

అయితే, ఏపీకి మూడు రాజధాని నగరాల ఏర్పాటు పై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఏపీ మంత్రులు విశాఖపట్నం భవిష్యత్ రాజధానిగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, మేకపతి గౌతమ్ రెడ్డి వంటి మంత్రులు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉండబోతుంది అని బహిరంగంగా ప్రకటించి, ఆదర్శవంతమైన పెట్టుబడికి వైజాగ్ గమ్యస్థానంగా మారబోతుంది అని ప్రకటించారు.

వాస్తవానికి, గౌతమ్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోనే పెద్ద ప్రకటన చేశారు, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఒక మలుపు అని చెప్పారు. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వచ్చే రోజుల్లో దేశంలోనే ఒక గొప్ప నగరంగా అవతరిస్తుంది అని చెప్పారు. అలాగే విశాఖపట్నం అన్ని రకాల అభివృద్ధికి సాధ్యమయ్యే ప్రాంతం, కానీ గత ఐదేళ్ళలో నిర్లక్ష్యం చేయబడింది. మేము దీన్ని ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయబోతున్నాము అని సీఎం మాటలపై రాజీ లేదు అని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో, విశాఖపట్నం కి భారీ పెట్టుబడులు వస్తాయని, విజయవాడ, తిరుపతి, గుంటూరు ప్రాంతాలకి చెందిన పారిశ్రామికవేత్తలు విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని అని అయన అన్నారు.