Begin typing your search above and press return to search.

చెన్నైకి చేరిన 2నౌకల్లో ఏమున్నాయి..?

By:  Tupaki Desk   |   4 Dec 2015 7:33 AM GMT
చెన్నైకి చేరిన 2నౌకల్లో ఏమున్నాయి..?
X
విపత్తు సమయాల్లో అయితే రోడ్డు మార్గం లేదంటే.. వాయు మార్గాల్లో అత్యవసర సేవలకు అవసరమైన వస్తు సామాగ్రిని పంపిస్తుంటారు. తాజాగా భారీ వర్షాలతో అతలాతకుతలమైన చెన్నైకు తక్షణ సాయం కోసం.. అత్యవసర వస్తు సామాగ్రిని అందించటం కోసం రెండు భారీ నౌకలు.. విశాఖపట్నం నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లాయి. సముద్ర మార్గంలో నౌకలా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సముద్రమార్గానికి మించింది లేదు. ఎందుకంటే.. విమానయానానికి అనువైన పరిస్థితులు లేకపోవటం.. రోడ్డు మార్గం మొత్తం దెబ్బ తినటం.. భారీగా సాయం అవసరమైన నేపథ్యంలో రెండు భారీ నౌకలు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లాయి.

ప్రస్తుతం చెన్నైకి చేరిన ఈ నౌకలు.. అక్కడి వారికి ఎంతో సాయం చేస్తాయని చెప్పక తప్పదు. రెండు నౌకల్లో వెళ్లిన భారీ సామాగ్రి చూస్తే.. నౌకామార్గం ద్వారా చాలా స్వల్ప వ్యవధిలో ఇంత భారీ వస్తు సామాగ్రిని పంపిణీ చేసే వీలుందా? అని అనిపించక మానదు.

చెన్నై చేరిన నౌకలు తీసుకెళ్లిన సామాగ్రిని చూస్తే..

= 30 టన్నులు రెఢీ టూ ఈట్ (టన్ను అంటే వెయ్యి కిలోలు)

= 5000 లీటర్ల వాటర్ బాటిళ్లు

= 700 టన్నుల మంచినీరు

= 300 టన్నుల టెట్రా పాల ప్యాకెట్లు

= 2000 కేజీల పాలపొడి

= 300 క్యాన్లు

= 10 ఫీల్డ్ వంటశాలలు

= 105 మంది డ్రైవర్లు

= 18 జెమినీ బోట్లు

= 200 టెంట్లు

= 30000 తువాళ్లు

= బ్లాంకెంట్లు.. దుప్పట్లు

= 8 జనరేట్లరు (7.5కేవీ)