Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే విశాఖపట్నం మరో అరుదైన ఘనత

By:  Tupaki Desk   |   13 Oct 2020 5:00 PM IST
ప్రపంచంలోనే విశాఖపట్నం మరో అరుదైన ఘనత
X
విశాఖపట్నం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సిటీ ఆఫ్ డిస్టెనీగా పిలుచుకునే విశాఖపట్నం లోని రుషికొండ బీచ్ ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ ల సరసణ స్థానం సంపాదించింది.

దేశంలోనే అందమైన బీచుల్లో విశాఖ ఒకటిగా పేరు తెచ్చుకుంది. సుధీర్ఘమైన సముద్రతీరంతో దీన్ని సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తున్నారు. అందుకే ఈ నగరానికి తాజాగా అరుదైన ఘనత దక్కింది.

మనదేశానికి చెందిన పలు బీచ్ లు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. దేశంలోని 8 బీచ్ లకు ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.ఇందులో విశాఖకు చోటు దక్కడం విశేషం.

నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, పర్యావరణ విద్య మరియు భద్రత అనే నాలుగు విభాగాల కింద బీచ్ ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం రుషికొండ బీచ్‌కు 'బ్లూ ఫ్లాగ్' ఎకో లేబుల్‌ను కేంద్రం ప్రదానం చేసింది.

గుజరాత్‌లోని శివరాజ్‌పూర్, ఘోగ్లా (డియు), కసర్‌కోడ్ మరియు పాడుబిద్రి (కర్ణాటక), కప్పడ్ (కేరళ), గోల్డెన్ (ఒడిశా) మరియు రాధనగర్ (అండమాన్)లు మిగతా ఏడు బీచ్ లు కూడా ‘బ్లూ ఫ్లాగ్’ బీచ్ లుగా గుర్తింపు పొందాయి. 'బ్లూ ఫ్లాగ్' ధృవీకరణను అంతర్జాతీయంగా పేరొందిన ప్రభుత్వేతర లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (FEE) ఇస్తుంది. సముద్ర ప్రాంతాలలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ 1985 లో 'బ్లూ ఫ్లాగ్' ధృవీకరణ ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. అదేవిధంగా, పారిశ్రామిక లేదా వ్యర్థ నీటి మురుగునీటిని బీచ్‌లోకి రానివ్వకూడదు. ఆల్గల్ వృక్షసంపద లేదా సహజ శిధిలాలు బీచ్‌లో ఉంచకూడదు.

'బ్లూ ఫ్లాగ్' సాధించడానికి షార్ట్‌లిస్ట్ చేసిన ఎనిమిది భారతీయ బీచ్‌లను సిద్ధం చేయడానికి ప్రభుత్వం పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (మోఇఎఫ్‌సిసి) ఆధ్వర్యంలో బీచ్ ఈస్తటిక్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (బీమ్స్) ను రూపొందించింది. రుషికొండ బీచ్ స్థానికులు వ్యాయామం చేయడానికి.., ఈత, క్రాఫ్ట్, కయాకింగ్, పిక్నిక్ మరియు ఫిషింగ్ కోసం ప్రతిరోజూ దాదాపు 20,000 మందిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.