Begin typing your search above and press return to search.

విశాఖలో ఏపీ పాలనా రాజధాని.. సీఎం క్యాంప్ ఇక్కడే?

By:  Tupaki Desk   |   1 Aug 2020 5:30 AM GMT
విశాఖలో ఏపీ పాలనా రాజధాని.. సీఎం క్యాంప్ ఇక్కడే?
X
మీనమేషాలు.. సంప్రదింపులు.. తర్జనభర్జనల తర్వాత కాగల కార్యం ఏపీ గవర్నర్ హరిచందన్ తీర్చేశారు. జగన్ కలలుగన్న మూడు రాజధానులు.. సీఆర్డీఏ బిల్లుకు ఆమోదం తెలిపారు.అంతా చట్టబద్ధమే. దీంతో ఇప్పుడు విశాఖకు పరిపాలన రాజధానిని తరలించడమే ఆలస్యం. వీలైనంత త్వరగా అక్కడి నుంచే పాలించాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పరిపాలన కేంద్రం.. సీఎం క్యాంప్ ఆఫీస్.. సీఎం నివాసం ఎక్కడా అనే ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..తిమ్మాపురం గ్రేహౌండ్స్ స్థలంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు కానుందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడి గ్రౌహౌండ్స్ ఆనందపురానికి తరలించనున్నారు. అక్కడ 300 ఎకరాలను గ్రేహౌండ్స్ కు ప్రభుత్వం కేటాయించింది.తిమ్మాపురంలో ఇప్పటికే స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది సీఎం క్యాంప్ కార్యాలయం అని అంటున్నారు.

ఇక సీఎం నివాసం రుషికొండపై ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. కొండపై ప్రస్తుతం పర్యాటక శాఖ అతిథి గృహాలు ఉన్నాయి. కొండపైన నివాసం వాస్తు, రాష్ట్రాభివృద్ధికి మేలు అని భావిస్తున్నారు.

విశాఖ సెంట్రల్ జైలు ఆవరణలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. విశాఖ జైలు 100.40 ఎకరాల్లో ఉంది. దీంతో ఇక్కడే ఏర్పాటు చేస్తారని అంటున్నారు.