Begin typing your search above and press return to search.
షారూక్ కొడుకు పట్టుబడిన క్రూజ్ మరేదో కాదు.. వైజాగ్ నుంచి బయలుదేరింది ఇదేనట!
By: Tupaki Desk | 12 Jun 2022 6:30 AM GMTక్రూజ్ అన్నంతనే విదేశీ ప్రయాణం చప్పున గుర్తుకు వస్తుంది. అందుకు భిన్నంగా విదేశీ క్రూజ్ ను దేశీయ సంద్రంలోకి తీసుకొచ్చిన ఘనత కార్డిల్లా ఎంప్రెస్ షిప్ సొంతం. దేశీయ సముద్రంలో అంతర్జాతీయ ఫైవ్ స్టార్ అనుభవాన్ని మిగిల్చే ఈ విలాసవంతమైన నౌక గడిచిన వారం రోజులుగా వార్తల్లో నలుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ విలాసవంతమైన నౌకకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్తను వింటున్న పరిస్థితి.
మొన్నటికి మొన్న వైజాగ్ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నైకి వెళ్లాల్సిన ఈ నౌకను.. పుదుచ్చేరిలో అనుమతి లభించకపోవటం.. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని పుదుచ్చేరికి అనుమతించేందుకునో చెప్పేయటంతో.. కాసేపు సముద్రంలో ఉండిపోయిన ఈ భారీ విలాసవంతమైన నౌక.. తర్వాత తన గమ్యస్థానం దిశగా ప్రయాణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అంశాన్ని కొన్ని మీడియా సంస్థలు భూతద్దంలో చూపించి.. అవసరానికి మించిన అతిని ప్రదర్శించిన పరిస్థితి.
ఇంతకీ ఈ భారీ నౌకకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గత ఏడాది ఈ షిప్పులో ప్రయాణించే సమయంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మీద డ్రగ్స్ ఆరోపణలతో అదుపులోకి తీసుకోవటం.. కొంతకాలం జైల్లోనే ఉండాల్సి రావటం తెలిసిందే. ఇటీవల ఈ కేసుకు సంబంధించిన ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ రావటం తెలిసిందే. అప్పట్లో ఆర్యన్ కు ఎదురైన అన్ని కష్టాలకు కేరాఫ్ అడ్రస్ కార్డిల్లా క్రూయిజ్ ఎంప్రెస్ షిప్.
అదే గత వారంలో వైజాగ్ నుంచి బయలుదేరి శనివారం ఉదయానికి చెన్నై పోర్టుకు చేరుకుంది. నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండే ఈ భారీ క్రూయిజ్.. గతంలో షారుక్ కొడుక్కి షాక్ తగిలేందుకు కారణమైన నౌక ఇదే కావటం గమనార్హం. ఈ షిప్పులో ప్రయాణించిన వారితో మాట్లాడినప్పుడు.. ఈ షిప్పుల్లో షారుక్ కొడుకును పట్టుకోవటం అంటే.. పక్కాగా ప్లాన్ చేసినట్లుగానే ఉందన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.