Begin typing your search above and press return to search.
నవ వధువు సృజన మృతిపై స్పందించిన ఆమె సోదరుడు
By: Tupaki Desk | 13 May 2022 1:35 PM GMTవిశాఖలో పెళ్లి పీటలమీదనే ప్రాణాలొదిలిన నవ వధువు సృజన మృతిపై బోలెడన్నీ అనుమానాలున్న వేళ ఆమె సోదరుడు క్లారిటీ ఇచ్చారు. సృజన పెళ్లి పీటలపై అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందిన షాక్ నుంచి బంధువులు తేరుకోలేకపోతున్నారు. ఆమె మృతికి కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్ లోనే వెల్లడవుతాయని బంధువులు చెబుతున్నారు.
ఇక సృజన హ్యాండ్ బ్యాగ్ లో గన్నేరు పప్పు ఉందని.. ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్తలను ఆమె సోదరుడు విజయ్ ఖండించారు. సృజన ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకుందని తెలిపాడు. పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడిందనే వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. పెళ్లిలో డేట్(రుతుక్రమం) సమస్య రాకూడదనే కొన్ని మాత్రలు వేసుకుందని.. వాటి కారణంగా రెండు రోజులుగా ఇబ్బంది పడిందని ఆమె సోదరుడు విజయ్ తెలిపారు.
సృజన హఠాన్మరణానికి కారణం తమకూ తెలియదని.. వైద్య నివేదికలు వస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. ఆమెది ఆత్మహత్య కాదని.. కారణాలేంటనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఇతర అనుమానాలేమీ తమ కుటుంబాల్లో లేవని విజయ్ తెలిపారు.
మరోవైపు సృజన మృతదేహానికి కేజీహెచ్ లో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని సృజన స్వస్థలం రంగారెడ్డి జిల్లా చందానగర్ కు తరలిస్తున్నారు. శవ పరీక్షలో సేకరించిన అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.
-అసలేం జరిగిందంటే?
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు సృజన పెళ్లిపీటలపైనే ఒక్కసారిగా కుప్పకూలింది. పెళ్లికొడుకు ఆమె తలపై జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. పెళ్లికూతురు కుప్పకూలడంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని భావించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముఖంపై నీళ్లు చల్లినా లేవలేదు. కానీ ఆస్పత్రికి వెళ్లేసరికే వధువు ప్రాణాలు వదిలేసింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె బతకలేదు. ఈ విషాద ఘటన విశాఖలోని మధురవాడలో జరిగింది. పెళ్లితంతు కూడా పూర్తి కావచ్చిన సమయంలో అనుకోని ఈ ఘటన జరగడంతో అంతా షాక్ లోనే ఉండిపోయారు.
ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే పెళ్లికూతురు సృజన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు పోతుందని భావించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా వివాహానికి నెలసరి అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఒక ట్యాబ్ లెట్ ఇచ్చారని.. అది వికటించి చనిపోయి ఉంటుందని సృజన బంధువులు చెబుతున్నారు. ఇంకొందరు ఏమో పెళ్లి ఇష్టం లేక సృజన ఏదైనా విషపదార్థం తీసుకొని ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఏం జరిగిందనేది అధికారికంగా మాత్రం ఇప్పటికీ బయటపడలేదు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ ఆమె మరణానికి కారణం ఏంటన్నది తెలియదు.