Begin typing your search above and press return to search.

చిన్నాయనా... ఓ చిన్నాయనా..?

By:  Tupaki Desk   |   14 Oct 2015 9:43 AM GMT
చిన్నాయనా... ఓ చిన్నాయనా..?
X
ప్రత్యేక హోదా కోసం జగన్ ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు.. ఏడో రోజు వేకువజామున ప్రభుత్వం బలంగా దీక్షను భగ్నం చేసింది. తిండీతిప్పలు లేకుండా ఉన్న జగన్ ఆరోగ్యం క్షీణిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు వచ్చారు... విశాఖపట్నంలో ఓడిపోయిన తరువాత పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రెస్ మీట్లలో కానీ కనిపించని వైఎస్ విజయమ్మ కొడుకును చూడ్డానికి వచ్చారు... జగన్ భార్య భారతి - సోదరి షర్మిల కూడా వచ్చారు. అమ్మ తరపు బాబాయి సుబ్బారెడ్డి జగన్ వెన్నంటే ఉన్నారు. ఇక్కడ అక్కడ కనిపించందంతా జగన్ కు బాబాయి - రాజశేఖరరెడ్డికి సోదరుడు అయిన వివేకానందరెడ్డే. ఏడు రోజులు దీక్ష చేసిన జగన్ ను చూడ్డానికి ఆయన ఎందుకు రాలేదు... జగన్ కు - వివేకాకు పొసగడం లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఆయన రాలేదని... ఇప్పుడే కాదు చాలాకాలంగా ఆయన పార్టీకి, జగన్ కు దూరంగా ఉన్నారని చెబుతున్నారు.

వైఎస్ వివేకా చాలాకాలంగా రాజకీయాల్లో కనిపించడం లేదు. ఆయన కడపలో ఉంటున్నారా... హైదరాబాద్ లో ఉంటున్నారా.. బెంగళూరులో ఉంటున్నారా... విదేశాల్లో గడుపుతున్నారా అన్నది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జగన్ కు తల్లి తరపున బాబాయి సుబ్బారెడ్డి వైసీపీ లో పూర్తిగా ప్రాబల్యం పెంచుకున్నారు. ఆయనే జగన్ కు అన్నీతానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే తండ్రి తరఫు బాబాయి వివేకా జగన్ కు దూరమైనట్లు తెలుస్తోంది.