Begin typing your search above and press return to search.

వివేకా హ‌త్య : అన్ని వేళ్లూ ఆ ఎంపీ వైపే..

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:29 AM GMT
వివేకా హ‌త్య : అన్ని వేళ్లూ ఆ ఎంపీ వైపే..
X
రెండు ప్ర‌ధాన మాధ్య‌మాలు ఎవ‌రికి అనుగుణంగా వాళ్లు వార్త‌లు రాస్తూ వైఎస్ వివేకాహ‌త్య కేసును మ‌రింత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా మార్చుకుంటున్నార‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు మ‌నుషులు అదేవిధంగా ఇదే స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫు మనుషులు మాట్లాడుతున్నారు.ఈ నేప‌థ్యంలో క‌ల్లూరు గంగాధ‌ర్ రెడ్డి అనే అప్రూవ‌ర్ ఈనాడుపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని కూడా అంటున్నారు. త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురిస్తే న్యాయ‌పోరాటం చేస్తాన‌ని అంటున్నారు.వివేక కేసులో ఎంపీ అవినాశ్ ప్ర‌మేయం లేద‌ని చెబుతున్నారు.ఇదంతా వైఎస్ సునీత చేస్తున్న ఆరోప‌ణ మాత్ర‌మే అని,ఇదంతా అస‌త్యం అని తేల్చేశారు.

అవినాశ్ ను కుట్ర‌లో ఇరికించాల‌ని సునీత భావిస్తున్నార‌ని గంగాధ‌ర్ రెడ్డి అంటున్నారు.అందుకే త‌న‌పై ఆమె ఒత్తిడి పెంచుతున్నార‌ని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌లూ ప్ర‌త్యారోప‌ణ‌లు ఎలా ఉన్నా కూడా సీబీఐ ద‌ర్యాప్తు మాత్రం అంత వేగంగా సాగ‌డం లేదు అన్న‌ది బాధిత వ‌ర్గం నుంచి వినిపిస్తున్న వాద‌న.అందుకే తాము నిరుత్సాహం చెందుతున్నామ‌ని అంటున్నారు.

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య వెనుక ప‌లువురి ప్ర‌మేయం ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.ముఖ్యంగా క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి ని ఉద్దేశించి కొన్ని అభియోగాలు ఉన్నాయి.ఈ కేసులో నిజానిజాలు ఇప్ప‌ట్లో తేలేలా లేవు.నిందితులు ఎవ‌రు అన్న‌ది సీబీఐ తేల్చే క్ర‌మంలో రోజుకో పేరు వెలుగులోకి వ‌స్తోంది. దీంతో కేసు ద‌ర్యాప్తు రోజురోజుకీ జ‌ఠిలం అవుతోంది.మ‌రోవైపు ఈ కేసు కు సంబంధం ఉన్న వ్య‌క్తుల వాంగ్మూలాను ఒక‌టికి ప‌దిసార్లు సేక‌రించే ప‌నిలో సీబీఐ ఉంది.ఇదే స‌మ‌యంలో త‌మ‌పై టీడీపీ అనుకూల మీడియా చెడు ప్రచారం చేస్తోంద‌ని వైసీపీ అంటోంది.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ గ‌త ఎన్నికల్లో జ‌రిగిన ఈ హ‌త్యోదంతం మ‌ళ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ న‌డిచేలానే ఉంది.వైసీపీ కూడా కేసు విష‌య‌మై స్ప‌ష్టం అయిన మాట‌లేవీ చెప్ప‌లేక‌పోతోంది.ఇదే స‌మ‌యంలో వైసీపీని టీడీపీతో పాటు జ‌న‌సేన కూడా టార్గెట్ చేస్తోంది.ఇవ‌న్నీ వైసీపీ వ‌ర్గాల‌కు కోపం తెప్పిస్తున్నాయి.

వీటి ప్ర‌భావం అన్న‌ది టీడీపీ పై క‌న్నా జ‌న‌సేన‌పై ఎక్కువ‌గా ఉంది. జ‌గ‌న్ ఇంత‌వ‌ర‌కూ టీడీపీ ఆర్థిక మూలాలపై దాడులు చేయ‌కున్నా,లేదా సంబంధిత సంస్థ‌ల‌ను నియంత్రించి ల‌బ్ధి పొందాల‌న్న ఆలోచ‌న కూడా చేయలేదు.కానీ బాబాయ్ హ‌త్య పై ప‌లు విష‌యాల‌ను వెలుగులోకి తెస్తూ, ట్రోల్ చేస్తున్న జ‌న‌సేన పై మాత్రం గుర్రుగానే ఉన్నారు జ‌గ‌న్.దీంతో వ‌రుస రెండు సినిమాల‌ను టార్గెట్ చేస్తూ వ‌సూళ్లు అన్న‌వి ప‌వ‌న్ కు అనుకూలంగా లేకుండా ఉండేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అవేవీ పెద్ద‌గా ఫ‌లించ‌లేదు అనే చెబుతోంది జ‌న‌సేన.

త‌మ‌కు వివేక హ‌త్యోదంతంపై అనుమానాలు ఉన్నాయ‌ని, వాటిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని వైసీపీని కోరుతోంది జ‌న‌సేన.ఇదే స‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున అంబ‌టి సీన్లోకి వ‌చ్చి కేసు విచార‌ణ‌లో ఉన్న‌ప్పుడు మాట్లాడ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. తాజాగా ద‌ర్యాప్తు వేగవంతం అయినా ఇదివ‌ర‌కే స్టేట్మెంట్లు ఇచ్చిన వారిని మ‌రోసారి సీబీఐ పిలిపించుకుని మ‌ళ్లీ వాంగ్మూలం తీసుకుంటున్నారు.ఈ కేసులో అవినాశ్ రెడ్డి ప్ర‌మేయ‌మే లేద‌ని చెబుతున్నారు ఇంకొంద‌రు సాక్ష్యులు. సాక్ష్యుల‌ను వైఎస్ సునీత బెదిరిస్తున్నార‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.వీటిలో నిజం ఎంత‌న్న‌ది తేల‌కున్నా ఇప్ప‌టికిప్పుడు ఈ కేసు ముగింపున‌కు అయితే చేరుకోదు.