Begin typing your search above and press return to search.
వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు...!
By: Tupaki Desk | 12 Nov 2020 9:10 AM GMTమాజీ మంత్రి , సీఎం జగన్ బాబాయ్ వై.ఎస్.వివేకా నందరెడ్డి హత్యకేసులో మళ్లీ వేగం పుంజుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ మూడో దఫా విచారణ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. వివేకా హత్యకేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో సీబీఐ అధికారులు.. వివేకా కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పులివెందుల కోర్టు నుంచి తీసుకునే అవకాశం ఉంది.అలాగే , ముగ్గురు అనుమానితుల నార్కో పరీక్షల నివేదిక, వివేకా రాసినట్లు చెబుతున్న చివరి లేఖ వివరాలను పులివెందుల కోర్టు నుంచి తీసుకునే అవకాశం ఉందని ప్రచారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
సీఎం జగన్ సొంత జిల్లా, కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15వ తేదీన ఎన్నికలకి అతి తక్కువ సమయంలో అంత్యంత దారుణ హత్యకు గురయ్యారు. హత్యకేసును ఛేదించేందుకు హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నెల రోజుల విరామం అనంతరం తిరిగి కడపకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా పులివెందుల, కడప ప్రాంతాల్లో అనుమానితులను విచారించిన అధికారులు కీలక ఆధారాల సేకరించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి జులై 9వ తేదీన సీబీఐ అధికారులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు రిజిష్టార్ అయ్యింది.
అలాగే , ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచికి చెందిన 3వ విభాగానికి కేసు బాధ్యతలు చేపట్టింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారి దీపక్‌కౌర్ ను నియమించారు. సీబీఐ అధికారుల బృందం ఇప్పటికే రెండు మార్లు పులివెందులలో పర్యటించి పలువురి అనుమానితులను విచారించి వెళ్లింది. ఈ ఏడాది జులై 18వ తేదీన తొలిసారిగా జిల్లాకు వచ్చిన సీబీఐ అధికారులు రెండు వారాల పాటు అనుమానితులను కడప, పులివెందులలో విచారించి వెళ్లారు. అనంతరం రెండో దఫా విచారణ సెప్టెంబరు 12వ తేదీ నుంచి చేపట్టారు. దాదాపు నెలరోజుల పాటు విచారణ చేసిన తరువాత కొందరు అధికారులు కరోనా బారిన పడడంతో వెళ్లిపోయారు. తాజాగా మూడో దఫా విచారణను ప్రారంభించనుంది.