Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు మళ్లీ బ్రేక్?
By: Tupaki Desk | 2 Oct 2020 1:30 PM GMTఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఆయనను చంపింది ఎవరనేది తేలలేదు. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ ఇటీవల చేసిన విచారణలో కొత్త కోణాలు వెలుగుచూశాయి. సీబీఐ విచారణను వేగవంతం చేసింది. త్వరలోనే కేసు తేలిపోతుందని భావిస్తున్న తరుణంలో ఈ విచారణకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
వివేకా హత్య కేసులో జులైలో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు మొదట 15 రోజుల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత మూడు బృందాలుగా విడిపోయి హత్యకు గల కారణాలను సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయాలపై దర్యాప్తు చేశారు.
కడప సెంట్రల్ జైలు కేంద్రంగా కొందరు.. పులివెందుల, అనంతపురం , చిత్తూరు జిల్లాల్లో మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం.
సీబీఐ విచారణలో వేగం పెంచడంతో త్వరలోనే తేలిపోతుందని భావిస్తున్న సమయంలో సీబీఐ అధికారుల విచారణకు కరోనా బ్రేక్ వేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక కరోనా భయం పట్టుకున్న మిగతా అధికారులు సైతం ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. ఇక అధికారులు విచారించిన ఖైదీలు. ఇతరులకు కూడా కరోనా బారినపడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
కాగా ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మా, కూతురు సునీత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ హత్య కేసును తేల్చాలని వారు కోరనున్నట్టు తెలిసింది.