Begin typing your search above and press return to search.
వివేకా హత్య కేసులో నిందితుడి ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్
By: Tupaki Desk | 5 March 2023 11:53 AM GMTసంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య కు సంబంధించిన విచారణ ఒకపక్క వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. హత్య జరిగి నాలుగేళ్లకు పైనే అవుతున్నా.. కేసు ఇప్పటికి ఒక కొలిక్కి రాకుండా ఆధారాలు సేకరించే పనిలో.. అనుమానితుల్ని విచారించే క్రమంలోనే సీబీఐ ఉంది.
ఇటీవల కాలంలో విచారణ వేగవంతం చేసిన సీబీఐ అధికారుల తీరు నేపథ్యంలో.. త్వరలో సంచలనాలు చోటు చేసుకునే వీలుందన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది.
వివేకా హత్య కేసులో నిందితుడైన గజ్జల ఉమాశంకర్ భార్య స్వాతిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి మరీ బెదిరింపులకు పాల్పడిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడే ఇలా ఎందుకు చోటు చేసుకుందన్నది ప్రశ్నగా మారింది. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోనే స్వాతి నివాసం ఉంటున్నారు.
శనివారం ఇద్దరు దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. ఆమెతో దురుసుగా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. వివేకాను చంపింది మీ భర్తేగా అంటూ దాడికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడి సతీమణి స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సీబీఐ ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే కాల్ లిఫ్టు చేయకపోవటంతో.. జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన ఎస్పీ తన కింది అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో.. ఆమె ఇంటికి హుటాహుటిన చేరుకొన్నారు. అప్పటికే ఆమెను బెదిరించిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.
ఈ ఉదంతం కలకలాన్ని రేపుతోంది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కడపకు తరలించినట్లుగా చెబుతున్నారు.
అయితే.. దాడికి ప్రయత్నించటం.. బెదిరింపులకు పాల్పడటం లాంటి విషయాల్ని బయటకు రానివ్వటం లేదంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.