Begin typing your search above and press return to search.

వివేక హత్యకేసు లో సిట్ ముందు హాజరైన మాజీ మంత్రి ..!

By:  Tupaki Desk   |   12 Dec 2019 7:19 AM GMT
వివేక హత్యకేసు లో సిట్ ముందు హాజరైన మాజీ మంత్రి ..!
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యపై సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. సిట్ దర్యాప్తు బృందం ఈ కేసులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ను సైతం విచారించింది. ఇటీవలే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు .

ఇప్పటి వరకు సిట్ దాదాపు 160 మందిని సిట్ విచారించి.. వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంది. తాజాగా నేడు మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణ కు హాజరయ్యారు.

ఈయనతో పాటుగా..వివేక వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.కాగా, తనకు ఈ హత్యకేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బుధవారం మీడియా సమవేశం లో స్పష్టం చేశారు. అంతేకాదు.. సంబంధం ఉందని తేలితే.. బహిరంగ ఉరికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డిని సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి.. వివేకా హత్య జరిగినప్పటి వరకు జరిగిన పరిణామాల పై మాజీ మంత్రిని ప్రశ్నించే అవకాశం ఉంది.