Begin typing your search above and press return to search.
ఈ విటమిన్ లోపముంటే ప్రమాదకరం..80 శాతం మందికి కరోనా
By: Tupaki Desk | 5 Sep 2020 11:30 PM GMTకరోనా వైరస్ తీవ్రత మొదలై.. 10 నెలలు గడిచినా ఇంతవరకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ కానీ, మందులు కానీ అందుబాటులోకి రాలేదు. అందుకే వైద్యులు వైరస్ బారిన పడిన వారికి రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు, బలవర్ధకమైన ఆహారం ఇవ్వడం ద్వారా చికిత్స అందజేస్తున్నారు. ఏ ఏ విటమిన్ లోపాలు ఉంటే వైరస్ సోకే అవకాశం ఉందో అలాంటి అంశాలపై శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేసి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కరోనా బారిన పడనివారు ముందస్తు జాగ్రత్తగా విటమిన్ డీ, సీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఆ విటమిన్లు లభించే ప్రత్యేక ఆహారం తీసుకుంటున్నారు. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు విటమిన్ డీ లోపం ఉన్నవారికి ఎక్కువగా కరోనా సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది విటమిన్ డీ లోపం ఉన్నట్లు నిర్ధారించారు. ముందస్తు జాగ్రత్తగా విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా వైరస్ కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం విటమిన్ డీ లోపం ఎవరికైతే ఉంటుందో.. అలాంటి వారు 80 శాతం మేర వైరస్ బారిన పడుతున్నట్లు నిర్ధారించారు. చికాగో యూనివర్సిటీలో గత మార్చి, ఏప్రిల్ నెలల్లో 489 మంది రోగులకు కరోనా పరీక్షలు చేశారు. ఇందులో విటమిన్ డీ 60 శాతం మంది ఉన్న రోగుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే వైరస్ బారిన పడ్డట్లు తేల్చారు. విటమిన్ డీ లోపం ఉన్న 25 శాతం మంది రోగుల్లో 22 శాతం మందికి పాజిటివ్ తేలింది. విటమిన్ డీ లోపం ఉన్న వారిలో 77 శాతం మంది వైరస్ బారిన పడుతున్నట్లు గుర్తించారు. విటమిన్ డీ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ లోపం ఉన్న వారిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడంతో కరోనా సోకడానికి అవకాశం ఎక్కువగా కలుగుతోంది. విటమిన్ డీ మందుల వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని వైద్య నిపుణులు తేల్చారు. సాధారణంగా ఉదయపు ఎండ ద్వారా ఎక్కువగా విటమిన్ డీ పొందవచ్చు. సాల్మన్ చేపలు, గుడ్డు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తుల్లో అధికంగా విటమిన్ డీ ఉంటుంది.