Begin typing your search above and press return to search.

లాక్ డౌన్‌ వల్ల విటమిన్ 'D' లోపం.. ఇది పరిష్కార మార్గం

By:  Tupaki Desk   |   6 July 2021 11:30 PM GMT
లాక్ డౌన్‌ వల్ల విటమిన్ D లోపం.. ఇది పరిష్కార మార్గం
X
ప్రస్తుత కాలంలో విటమిన్ D బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలకు లాక్ డౌన్ విధించడం కన్నా... అత్యుత్తమ మార్గం మరేమీ కనిపించలేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు లాక్ డౌన్ బాట పట్టి కొంతలో కొంత కరోనాను అదుపులోకి తీసుకు రాగలిగాయి. లాక్ డౌన్ మూలాన చాలా వర్గాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

ఇళ్లకు పరిమితం కావడం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో పాటు అనేక శరీర రుగ్మతలను ఎదుర్కొన్నారు. కొంత మంది ఆకతాయిలు ఏదో ఓ సాకు చూపి బయట తిరిగినా కూడా పోలీసులు వారి కి పరిష్మెంట్ ఇచ్చారు. ఎంతో మంది చిరు వ్యాపారుల ఉపాధి అవకాశాలకు ఈ లాక్ డౌన్ మూలాన దెబ్బపడింది.

దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక ప్రదేశంలో లాక్ డౌన్ విధిస్తూనే ఉన్నారు. ఈ లాక్ డౌన్ మూలాన అనేక మంది ప్రజలు ఇష్టం లేకున్న కాని ఇళ్లలోనే గడిపారు. ఇలా చాలా రోజులు ఇళ్లలో ఉండడం వల్ల అనేక మందిలో అనేక శారీరక సమస్యలు వెలుగు చూశాయి. ఇలా వచ్చిన శారీరక సమస్యల్లో ఒకటి విటమిన్ D లోపం. సాధారణంగా విటమిన్ D అనేది ఉదయం పూట వచ్చే సూర్య కిరణాలలో ఉండి మనకు ఫ్రీ గానే దొరకుతుంది. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని అసలు జనాలు బయటకు రావడమే తగ్గించేశారు.

ఈ కారణం వల్ల అనేక మందిలో విటమిన్ D లోపం ఏర్పడింది. కేవలం విటమిన్ D లోపం ఏర్పడడం మాత్రమే కాకుండా అనేక రకాల ప్రతికూలతలు వెలుగు చూస్తున్నాయి. బయట ఎలాంటి పని లేకుండా ఇలా ఇంట్లోనే కూర్చుండటం మూలాన కొంత మందిలో అధిక బరువు సమస్య కూడా వచ్చింది. ఇక అన్ని రకాల విటమిన్ల లోపంతో బాధపడే వారి సంఖ్య అనేకంగా ఉంది.

ఇలా విటమిన్ D లేకుండా ఇంట్లో ఉండటం వల్ల అధిక ప్రమాదముంటుందని డాక్లర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి సమస్యలు బయటపడని వారిలో కూడా విటమిన్ D లోపంతో భవిష్యత్ లో అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా విటమిన్ D మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి.. అంటు వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. అంతే కాకుండా బోన్స్ని హెల్దీగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రారంభంలో ఎలా ఉన్నా... రాను రాను ఈ విటమిన్ D లోపం వల్ల కండరాలు తిమ్మిరెక్కడం, నడుం నొప్పి తదితర సమస్యలు ఉంటాయి.