Begin typing your search above and press return to search.
విస్తారాకు డీజీసీఏ షాక్.. రూ.10 లక్షల జరిమానా
By: Tupaki Desk | 2 Jun 2022 11:30 PM GMTవిస్తారా ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) షాక్ ఇచ్చింది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే చర్యలు తీసుకున్నందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది. భద్రతా నియమాలు ఉల్లంఘించడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విస్తారా ఎయిర్‌లైన్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారీ జరిమానా విధించింది. భద్రతా నియమాలు ఉల్లంఘించడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ప్రకటన జారీ చేసింది. అసలేం జరిగిందంటే..
ఇండోర్ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్ విషయంలో విస్తారా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సరైన శిక్షణ తీసుకోని పైలట్లను విమానం ల్యాండ్ చేయడానికి అనుమతించింది. ఈ విమానానికి మొదటి అధికారిగా నియమించిన పైలట్ సిమ్యులేటర్‌లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారని అధికారులు తెలిపారు.
దీనిని తీవ్రమైన చర్యగా భావిస్తూ విస్తారా ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఇది తీవ్రమైన ఉల్లంఘన అని, ఇది విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా.. టేకాఫ్, ల్యాండింగ్ క్లియరెన్స్‌లను ఉల్లంఘించిందని అధికారి తెలిపారు. ఈ కేసులో విస్తారా విమానయాన సంస్థ ను దోషిగా పరిగణిస్తూ రూ.10 లక్షల జరిమానా విధించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. అయితే ఈ విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎప్పుడు ఈ ఘటన జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
విమానానికి మొదటి అధికారిగా నియమించిన పైలట్‌కు మొదట సిమ్యులేటర్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి శిక్షణ ఇస్తారు. అప్పుడే ప్రయాణికులతో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అతను అర్హులుగా పరిగణిస్తారు. విమానం కెప్టెన్ కూడా సిమ్యులేటర్‌లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్‌తో పాటు విస్తారాకు చెందిన ఇండోర్ విమానానికి చెందిన మొదటి అధికారి కూడా సిమ్యులేటర్‌లో శిక్షణ తీసుకోలేదని అధికారులు తెలిపారు. అయినా ఎయిర్‌లైన్స్ మొదటి అధికారిని విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించి ప్రయాణికుల ప్రాణాలను ఆపదలో పడేసిందని అన్నారు.