Begin typing your search above and press return to search.
విస్తారా ఎయిర్‌లైన్స్ సూపర్ ఆఫర్.... దేశ వ్యాప్తంగా విమానంలో ఉచిత ప్రయాణం !
By: Tupaki Desk | 27 April 2021 2:32 PM GMTకరోనా మహమ్మారి భారతదేశాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. మొదటి వేవ్ లో కంటే ఈ సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. అలాగే మరో ముఖ్యమైన సమస్య ఆక్సిజన్ కొరత తో చాలామంది కన్నుమూస్తున్నారు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో కూడా మెడికల్ ఆక్సిజన్ తయారు చేస్తున్నా కూడా ఇంకా పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు కన్నుమూస్తున్నారు. దీనితో దేశంలో మళ్లీ లాక్ డౌన్ , ఆంక్షలు ప్రారంభం అయ్యాయి. ఇదిలా ఉంటే ..ఈ కరోనా విజృంభణ సమయంలో వైద్యులకు , నర్సులకి విస్తారా ఎయిర్ లైన్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించింది. కరోనా మహమ్మారి కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది.
ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు, తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. విస్తారా ఎయిర్ లైన్స్ ఆదివారం ఈ ఆఫర్ ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగానే విమానంలో ప్రయాణించవచ్చు. విస్తారా ఎయిర్ లైన్స్ ఈమేరకు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి ఉత్తరం రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్ కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా వెల్లడించింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందవచ్చని తెలిపింది. అయితే సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విస్తారా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పవచ్చు. అయితే ఈ ఉచిత విమాన ప్రయాణంపై విస్తారా ఒక నిబంధన విధించింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్ కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్ లైన్స్ పేర్కొంది. అయితే , ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని వెల్లడించింది.