Begin typing your search above and press return to search.
టీడీపీలో `విజన్` సమస్య.. ఏం జరిగిందంటే..!
By: Tupaki Desk | 6 May 2021 4:30 AM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మరో శంక పట్టుకుంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది.. దారుణంగా ఉంది.. అని జాలిపడే వారు ఎక్కువగా ఉన్నా.. ఆ దారుణ పరిస్థితిని చక్కదిద్దేనాయకులు.. ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. పైగా.. ఈ దారుణంగా ఉందని చెప్పే నాయకులు.. ఎవరూ కూడా పార్టీ తరఫున పోరా డేందుకు ముందుకు రావడం లేదు. చాలా మంది పార్టీని చూసి అయ్యో అని అనుకోవడం తప్పా జనాల్లోకి వచ్చేవారు.. పార్టీని బతికిద్దామన్న ఆలోచన ఉన్న వారు లేకుండా పోయారు. ఇదిగో ఈ జిల్లాలో ఇన్ని స్థానాలు గ్యారెంటీ.,. ఖచ్చితంగా ఈ స్థానంలో గెలిచి తీరుతాం! అనే పరిస్థితి కనిపించడం లేదు.
నిజానికి పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక పేరు ఉండేది.. అదే విజన్ ఉన్న నాయకుడు! అని! ఆయనకు చాలా దూరదృష్టి ఉందని.. ఎప్పుడో 100 ఏళ్ల ఫ్యూచర్‌ను కూడా పసిగట్టి.. ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఆయనకు పేరుంది. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన 1999లోనే తాను వచ్చే 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాననే విజన్ 2020 అంటూ చెప్పేవారు. ఆ తర్వాత ఆయన పదేళ్లు అడ్రస్ లేరు. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చినా ఈ వ్యూహానికి పదును పోయింది. అటు చంద్రబాబు, ఇటు పార్టీ నేతలకు కూడా ఇప్పుడు విజన్ ఏమైందనే సందేహాలు వస్తున్నా యి. నిజానికి ఏ పార్టీకైనా దూరదృష్టి, నేతల ఫ్యూచర్‌పై పూర్తిగా కాకపోయినా.. కొంత వరకైనా పట్టుండాలి కదా ! అన్నదే ప్రశ్న.
కానీ, ఇప్పుడు టీడీపీలో ఈ విజనే లోపించింది. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కుతారు? ఎక్కడ పార్టీ పరిస్థితి బాగోలేదు.. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు..? ఎవరిని లైన్‌లో పెట్టాలి ? అసలు మన విధానాలు ప్రజలకు ఎందుకు ? నచ్చడం లేదు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. విజనరీ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకోవడం చాలా కష్టమని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం జరిగిన తిరుపతి బైపోల్ సహా కొన్నాళ్ల కిందట జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఇప్పటికైనా.. పార్టీ నేతలు ముందు చూపుతో వ్యవహరించాలని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.