Begin typing your search above and press return to search.

వీ.హెచ్.పీ మహాసభ చీఫ్ కాల్చివేత

By:  Tupaki Desk   |   2 Feb 2020 6:43 AM GMT
వీ.హెచ్.పీ మహాసభ చీఫ్ కాల్చివేత
X
బీజేపీ కొలువుదీరిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రాజధాని లక్నోలో విశ్వహిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్ పై ఆదివారం ఉదయం ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రంజిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

లక్నోలోని హజ్రత్ గంజ్ ప్రాంతంలోని గ్లోబ్ పార్క్ వద్ద ఈ దారుణం చోటుచేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన దుండగులు వెనువెంటనే పరారయ్యారు.

తుపాకీ కాల్పుల్లో తూటాలు డైరెక్ట్ తలలోకి దూసుకెళ్లడంతో రంజిత్ బచ్చన్ అక్కడికక్కడే మృతిచెందారు. రంజిత్ ది సీఎం యోగి సొంత ఊరు అయిన గోరఖ్ పూర్ కావడం గమనార్హం.

ఈ కాల్పుల ఘటనలో రంజిత్ ను కాపాడబోయిన ఆయన సోదరుడిపై కూడా దుండగులు కాల్పులు జరిపారు. ఆయన కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఆరు బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు ఉండడం.. హిందుత్వ నాయకుల ఆధిపత్యం పెరిగిపోతుండడంతో కొందరు దుండగులు వారిని హతమార్చుతున్నారు. గత అక్టోబర్ లోనూ సమాజ్ వాదీ పార్టీ నేత కమలేష్ ను ఇలానే కాల్చి చంపారు.