Begin typing your search above and press return to search.
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న విశాఖ వందే భారత్
By: Tupaki Desk | 17 Jun 2023 3:00 PM GMTప్రతిష్ఠాత్మకంగా స్టార్ట్ చేసిన ఒక రైలుకు సంబంధించి తరచూ చేస్తున్న మార్పులు చేర్పులు ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు ప్రయాణించి.. మళ్లీ సికింద్రాబాద్ లో బయలుదేరి రాత్రికి విశాఖకు చేరే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు సంబంధించి ఇప్పుడో కొత్త సమస్య ప్రయాణికుల్ని తెగ ఇబ్బంది పెడుతోంది. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. అత్యంత వేగంగా.. తక్కువ ప్రయాణ వ్యవధితో ప్రయాణించే వీలుందని చెప్పే విశాఖ వందే భారత్ టైమింగ్స్ ను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు.
గడిచిన కొద్ది రోజులుగా ఈ ట్రైన్ షెడ్యూల్ ను మారిపోతున్న విషయం.. ప్రయాణానికి ఒక రోజ ముందు రావటం.. దీంతో ప్రయాణాల్ని రీషెడ్యూల్ చేసుకోవటానికి ఆప్షన్స్ తక్కువగా ఉండటం ఇబ్బందిపెడుతోంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ ట్రైన్.. ఉదయం 5.45 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నానానికి సికింద్రాబాద్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి బయలుదేరి అర్థరాత్రికి కాస్త ముందుగా విశాఖకు చేరుకుంటుంది.ఈ రైలులో ప్రయాణించే వారిలో చాలామంది టైంకు ప్రాధాన్యతను ఇవ్వటమో.. లేదంటే టైంతో మరికొన్ని పనులతో లింకు ఉండటమో ఉంటుంది.
కానీ.. వందే భారత్ ట్రైన్ షెడ్యూల్ ను ఎప్పటికప్పుడు మార్చేయటం ద్వారా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మారిన షెడ్యూల్ సైతం ఒకేలా ఉండకుండా రోజుకో రీతిలో ఉంటుందన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. గత శనివారం ఉదయం 5.45కు బయలుదేరాల్సిన విశాఖ వందే భారత్ పది- పదకొండు గంటల మధ్యలో బయలుదేరింది. ఈ రోజు (శనివారం) విషయానికి వస్తే.. ఉదయం 10 గంలలకు బయలుదేరి..సికింద్రాబాద్ కు మధ్యాహ్నం కాకుండా రాత్రి 7-8 గంటల మధ్య వస్తుందని చెబుతున్నారు. దీంతో.. రాత్రి వేళలో బయలుదేరే ఈ ట్రైన్ విశాఖకు చేరుకునే సరికి.. అటుఇటు కాని టైం అవుతుందని మండిపడుతున్నారు. సో.. అర్థం లేని షెడ్యూల్ తో ఇబ్బంది పెట్టే విశాఖ వందే భారత్ షెడ్యూల్ రిస్కును పరిగణలోకి తీసుకొని టికెట్లు బుక్ చేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో.. బీకేర్ ఫుల్.