Begin typing your search above and press return to search.

వైజాగ్ స్టీల్ ప్లాంటుపైనా కరవు ఎఫెక్టు

By:  Tupaki Desk   |   23 April 2016 6:57 AM GMT
వైజాగ్ స్టీల్ ప్లాంటుపైనా కరవు ఎఫెక్టు
X
మండు వేసవిలో జనానికి చుక్కలు చూపిస్తున్న నీటి కరువు విశాఖ స్టీల్ ప్లాంటునూ వదల్లేదు. నిరంతరం భారీ ఉత్పత్తితో ముందుకు సాగుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం నీటి కొరత ఎదురైంది. ఏలేరు - గోదావరి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి పోవడంతో స్టీల్ ఫ్లాంటుకు నీటిసరఫరా తగ్గిపోయింది. గోదావరి - ఏలేరు జలాశయాల నుంచి వైజాగ్ సిటీని నీరు సరఫరా చేస్తారు... ఎన్టీపీసీ - స్టీల్ ప్లాంటులకు కూడా అక్కడి నుంచే నీరొస్తుంది. అయితే, వాటిలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో ప్రజలకు సరఫరా చేసే నీరూ తగ్గిపోయింది. పనిలోపనిగా స్టీల్ ప్లాంటుకు కూడా సగానికి సగం నీటి సరఫరా ఆపేశారట.

వైజాగ్ స్టీల్ ప్లాంటుకు రోజుకు 35 ఎంజి డిల నీరు అవసరం.. కానీ, ప్రస్తుతం కేవలం 15 నుంచి20 ఎంజిడీల నీరు మాత్రమే ఇస్తున్నారు. ఇలా అయితే , ప్లాంట్‌ మూసుకోవాల్సిందేనని స్టీల్ ప్లాంటు అధికారులు అంటున్నారు. మరోవైపు విశాఖ ప్రజలకు రోజుకు 22 ఎంజీడి నీటిని సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 8 ఎంజిడీలతో సరిపెడుతున్నారు. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కే తలమానికమైన విశాఖ ఉక్కు పరిశ్రమకే గడ్డు పరిస్థితులు వస్తే... భవిష్యత్తులో ఏపీని పారిశ్రామికంగా డెవలప్ చేస్తానంటున్న సీఎం చంద్రబాబు మాటలను ఎలా నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఉన్న పరిశ్రమలనే కాపాడుకోలేనప్పుడు... మూసివేత పరిస్థితులు కల్పిస్తున్నప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టేవారిలో ఎలా నమ్మకం కలుగుతుందన్న ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ఇండస్ట్రియల్ బూమ్ లో ఇప్పుడు విశాఖ కేంద్రంగానే చాలామంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. వారికి నమ్మకం కల్పించాడికైనా స్టీల్ ప్లాంట్ లో నీటి కరువును నివారించాల్సిన అవసరం ఉంది.