స్కూలు పక్కనే వ్యభిచారం.. గుట్టు రట్టైంది ఇలా..!

Sun Sep 27 2020 23:00:01 GMT+0530 (IST)

visakhapatnam police busted prostitution racket in gajuwaka

విశాఖ గాజువాకలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. పక్కా సమాచారంతో పోలీసులు ఈ వ్యభిచార గృహంపై దాడులు చేశారు. పలువురు యువతులను విటులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.విశాఖలో ముగ్గురు వ్యక్తులు  ఓ మహిళ కలిసి ముఠాగా ఏర్పడి వ్యభిచార దందా మొదలు పెట్టారు. విశాఖ శివారు ప్రాంతంలోని గాజువాక అందుకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు.

గాజువాకలోని ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలకు దగ్గర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. విజయవాడ - గుంటూరు - హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు.

శనివారం సాయంత్రం పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ చీకటి వ్యాపారం వెలుగు చూసింది. ఈ సందర్భంగా ముగ్గురు యువతులు ఒక విటుడు ఇద్దరు మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.