Begin typing your search above and press return to search.
కిడ్నాప్ కేసు : కిందా మీదా అవుతున్న వైసీపీ
By: Tupaki Desk | 18 Jun 2023 1:13 PM GMTవిశాఖ మెగా సిటీ ఇంకా గట్టిగా చెప్పాలంటే వైసీపీ అధినాయకత్వం ఎంతో మెచ్చి రాజధాని చేయాలనుకుంటున్న నగరం. జగన్ డ్రీం సిటీ ఇలా విశాఖ అన్ని విధాలుగా వైసీపీ కి అత్యంత కీలకం. అలాంటి చోట సొంత పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సొంత కుటుంబ సభ్యులే కిడ్నాప్ కావడం, మూడు రోజుల పాటు చిత్ర హింసలు అనుభవించడం ఇవన్నీ కూడా ఇపుడు వైసీపీని కిందా మీద అయ్యేలా చేస్తున్నాయి.
ఈ కేసులో ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ అయిన డేట్ టైం అన్నది తరువాత తెలిసాయి. వారిని పోలీసులు సేఫ్ గా విడిపించిన తరువాతనే ఈ ఇష్యూ బయటకు వచ్చింది. దాంతో ఇదిపుడు ఏపీ రాజకీయాలనే అట్టుడికేలా చేస్తోంది. నన్ను కూడా కిడ్నాప్ చేసి ఉండేవారే. అలాగే మా కోడలిని కూడా. అయితే ఆమె పుట్టింటికి వెళ్ళింది. నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి బతికిపోయామని మీడియా ముందు ఎంవీవీ సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
తన నుంచి ఏకంగా ఇరవై కోట్ల దాకా వసూల్ చేయాలన్నది కిడ్నాపర్ల ప్లాన్ అని ఆయన చెబుతున్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరని ఎంపీ అంటున్నారు. ఇదంతా డబ్బు కోసమే అని చెబుతున్నారు. పోలీసులు కూడా ఇదే నిజమని అంటున్నారు. కానీ ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, పైగా రెండు రోజుల పాటు నిర్భంధించి కత్తులతో క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి ఇబ్బంది పెట్టారని అంటున్నారు.
ఇక జీవీ అనబడే జి వెంకటేశ్వరరావు ఆడిటర్ గా ఉంటున్నారు. ఆయన సీఎం జగన్ కి అత్యంత సన్నిహితులు, పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా ఆయన పని చేస్తున్నారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ చైర్మన్ గా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఇలాంటి జీవీని కూడా కిడ్నాపర్లు బంధించి హింసించారు ఒక విధంగా ఇది వైసీపీ ప్రభుత్వానికే సవాల్ గా మారిన కేసుగా ఉంది.
ఇంతకీ పోలీసులు పట్టుకుంది ఎవరిని అంటే ఆకు రౌడీలుగా ఉన్న వారికే. అలాంటి వారికి ఎంపీ ఇంట్లో ప్రవేశించే ధైర్యం ఎలా వస్తుంది. ఇక జీవీ సీఎం తో నేరుగా కలిసేంటంత సాన్నిహిత్యం ఉన్న వారు. ఆయనను కిడ్నాప్ చేయడం అంటే అది ఎలా సాధ్యం అన్న చర్చ వస్తోంది. ఇదంతా మామూలు రౌడీ షీటర్ల పనే అని డీజీపీ నుంచి పోలీసుల దాకా ఎవరు చెప్పినా విపక్షాలు మాత్రం నమ్మడంలేదు.
దీని వెనక సూత్ర ధారులు పెద్ద వారే ఉంటారని, బిగ్ షాట్స్ ఉంటాయని అంటున్నారు. రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే ఈ కేసులో ల్యాండ్ మాఫియా హస్తం ఉందని, చాలా మంది పెద్దలు ఉంటారని అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే రాయలసీమ గ్యాంగ్ పని అంటున్నారు.
తెలుగుదేశం అయితే ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది. అధికార పార్టీ ఎంపీకే రక్షణ లేని పరిస్థితి అని చెబుతోంది. చంద్రబాబు ఇదే రకంగా ఆరోపణలు చేశారు.ఇపుడు ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్జి బుద్ధా వెంకన్న సీన్ లోకి వచ్చారు. ఒక ఎంపీ మీద ఇలాంటివి జరుగుతాయని తాను ఆరు నెలల క్రితమే చెప్పాను అంటున్నారు. మరో ఎంపీ మీద కూడా ఇలాంటి టార్గెట్ ఉందని అంటున్నారు. తొందరలో తాను వచ్చి విశాఖ ఎంపీని పరామర్శిస్తాను అని అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో విశాఖ ఇష్యూని హైలెట్ చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సవ్యంగా లేదని, దానికి విశాఖలో ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కావడమే ఉదాహరణ అని చెబుతున్నారు ఇక ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు విశాఖ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ అరాచకాలకు అడ్డగా మారింది అని విమర్శించారు.
దాన్ని బేస్ చేసుకుని ఇపుడు విశాఖ నిండా జన జాగరణ సమితి పేరుతో పోస్టర్లు వెలిసాయి. సేవ్ వైజాగ్ పేరుతో వెలసిన ఆ పోస్టర్లలో విశాఖను ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, గంజాయి మాఫియా, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలతో పాటు ఇపుడు కొత్తగా మర్డర్స్, కిడ్నాపులు కూడా జరుగుతున్నాయని విశాఖను సేవ్ చేయాల్సిన అవసరం ఉందని జన జాగరణ సమితి డిమాండ్ చేస్తోంది.
నేరుగా అమిత్ షాకే విన్నపాలు చేసుకుంటోంది. మొత్తానికి చూస్తే సొంత పార్టీ ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పోలీసులు చెబుతున్న విషయాలు అయితే లాజిక్ కి అందకుండా ఉంటున్నాయని అంటున్నారు. ఎంపీ ఇంట్లోకి నేరుగా ఆకు రౌడీలు వెళ్ళి మూడు రోజుల పాటు బయటకు పొక్కకుండా కిడ్నాప్ చేసేలా విశాఖలో లా అండ్ ఆర్డర్ ఉందా అని నిలదీస్తున్నారు.
విశాఖకు రేపో మాపో పరిపాలనా రాజధాని వస్తుంది అని వైసీపీ పెద్దలు చెబుతున్న క్రమంలో విశాఖలో చోటు చేసుకున్న ఈ సంఘటనలు అధికార వైసీపీకి తలనొప్పిగా మారాయని అంటున్నారు. మామూలుగా జరిగే నేరాలుగానే వీటిని వైసీపీ నేతలు చెబుతున్నా జనాల్లో అయితే అనుమానాలు పెరిగేలా విపక్షాల ప్రచారం ఉంది. విశాఖకు ఏదో జరుగుతోంది అన్న చర్చ అయితే అంతకంతకు బలపడుతోంది. ఇది తీవ్ర వ్యతిరేకంగా మారితే అధికార పార్టీకి రాజకీయంగా దెబ్బే అంటున్నారు.