Begin typing your search above and press return to search.
విశాఖ లీడర్లకు బాబు బ్యాడ్ న్యూస్
By: Tupaki Desk | 9 April 2017 9:32 AM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణతో కొందరు తమ్ముళ్లు అప్ సెట్ అవగా తాజాగా బాబు చేసిన ప్రకటనతో మరికొందరు నారాజ్ అయిపోయారు. ఇదంతా సింహాచలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని చేసిన ప్రకటన ఫలితం. బాబు ప్రకటన చూస్తే, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిపేందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. చంద్రబాబు ప్రకటనతో తెలుగు తమ్ముళ్లలో నీరసం ఆవహించింది.
జీవీఎంసీలో అనకాపల్లి - భీమిలి మున్సిపాలిటీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సమస్య మొదలైంది. వాస్తవానికి కోర్టు కేసుల వలన జీవీఎంసీ ఎన్నికలు వాయిదా పడడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పంచగ్రామాల సమస్యను పరిష్కరించలేకపోయారు. ఈ అంశం కోర్టులో ఉంది. ఈ కేసును కొలిక్కి తీసుకురావాలంటే, ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పంచగ్రామల సమస్య పరిష్కరించకుండా ఎన్నికలకు వెళితే, అధికార పార్టీకి ఇబ్బంది తప్పదు. జీవీఎంసీకి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే, ఏదో రకంగా గట్టెక్కచ్చన్నది తెలుగు తమ్ముళ్ల ఆశ. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షం గెలిచిన నేపథ్యంలో జోష్ మీద ఉంది. అయితే పరిస్థితులు అనుకూలించక, ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే, ప్రతిపక్షం ముందు చులకనైపోతామన్న భావన అధికార పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది. గడచిన ఐదు సంవత్సరాల నుంచి పాలకవర్గం లేకుండానే జీవీఎంసీ నడుస్తోంది. ఎప్పటికప్పుడు దీనికి ఎన్నికలు జరుగుతాయని అధికార పార్టీలో ఆశావహులంతా కలలుకంటూ వస్తున్నారు.
మరోవైపు రైల్వే జోన్ అంశం కూడా అధికార టీడీపీ - బీజేపీలకు ప్రతికూలంగా కనిపిస్తోంది. విశాఖకు జోన్ రావడం విషయాన్ని పక్కన పెడితే, జోన్ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదని రైల్వే వర్గాలే చెపుతున్నాయి. ఇదిలా ఉండగా జీవీఎంసీతోపాటు, రాష్ట్రంలోని పలు నగరపాలక సంస్థలకు, మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరపాల్సి ఉంది. అక్కడ అధికార పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని అధికార పార్టీ వర్గాల భోగట్టా. 2014లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వేడిలో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించి ఉంటే, పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చి ఉండేవి. పోనీ హుదూద్‌లో విశాఖకు జరిగిన నష్టాన్ని పూడ్చి చంద్రబాబు ప్రజల మన్ననలు అందుకున్నారు. అదే సమయంలో జీవీఎంసీకి ఎన్నికలు జరిగి ఉంటే, టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవేమో! ఎందుకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు అవకాశాలను వదులుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు, విశాఖలో అపరిష్కృత సమస్యలు పెరిగిన నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లడం సమంజసం కాదని కొంతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలే అభిప్రాయపడుతున్నారు. జీవీఎంసీకి ఎన్నికలు జరపడానికి ఇబ్బందులంటే, రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించవచ్చు కదా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/