Begin typing your search above and press return to search.
వక్రీకరణల పై ఫైర్ అయిన విశాఖ ఎంపీ... మీడియానే కారణం!
By: Tupaki Desk | 21 Jun 2023 5:40 PM GMT13, 14, 15 తేదీల్లో తన కుమారుడు, తన భార్య, ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం, అనంతర పరిణామాల మీద తాజాగా మరింత క్లారిటీ ఇస్తూ... తన వ్యాపారాలు హైదరాబాద్ కు ఈ కిడ్నాప్ వ్యవహారం వల్ల షిఫ్ట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపైనా విశాఖ ఎంపీ ఎంవీవీ స్పందించారు.
జూన్ 12వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల వరకూ కూడ తన ఆఫీసులో తనతో పాటు తన అబ్బాయి కూర్చున్నారని, వివాహం అనంతరం ఆయన రుషికొండలో నివాసం ఉంటున్నాడని ఎంపీ తెలిపారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు పడుకుని తర్వాత రోజు ఐదు గంటలౌ లేచి మంచినీళ్ల కోసం కిందకి వచ్చినప్పుడు కిడ్నాప్ జరిగిందని తెలిపారు.
13వ తేదీ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తన కుమారుడిని రుషికొండలో ఉన్న ఇంట్లో ముగ్గురు వ్యక్తులు బెదిరించి కిడ్నాప్ చేయడం జరిగిందని ఎంపీ మరోసారి తెలిపారు. ఆ సమయంలో జరిగిన ఘర్షణల అనంతరం తన కుమారుడిని హోం థియేటర్ లో బందించారని ఎంపీ వివరించారు. అనంతరం చిత్రహింసలకు గురిచేశారని.. ఇంట్లో ఉన్న 16 లక్షల రూపాయలతో పాటు గోల్డ్ ని కూడా తీసుకున్నారని తెలిపారు.
తర్వాత ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన భార్యకు ఫోన్ చేసి... తనకు అనారోగ్యంగా ఉందని, ఇంటికొచ్చి తనకు కాస్త సాయం చేయాలని అడిగించారని ఎంపీ తెలిపారు. అదే సమయంలో తనకు కూడా ఫోన్ చేసి నార్మల్ గా మాట్లాడించారని ఎంపీ అన్నారు. అంతకంటే ముందు భీమిలి స్టేషన్ కు కూడా ఫోన్ చేయించి.. హేమంత్ అనే వ్యక్తి తనతో ఉంటాడు, రెండు రోజుల పాటు స్టేషన్ కి రమ్మని ఒత్తిడి చేయొద్దని ఫోన్ కూడా చేయించారని చెప్పారు.
తర్వాత రోజు ఉదయం తాను ఎయిర్ పోర్ట్ కి వెళ్లిపోవడం, అదే కారులో తన భార్య తన కుమారుడి ఇంటికి వెళ్లడం జరిగిందని తెలిపారు. అనంతరం అతని భార్యను సైతం కిడ్నాప్ చేసి, తన కుమారుడితో డ్రైవర్ కి ఫోన్ చేయించి.. అక్కడ నుంచి పంపించేశారని ఎంపీ వివరించారు. అనంతరం జీవీ ని పిలిపించడం, ఆయన వచ్చాక ఆయన్ని కూడా బందించి.. ఆయన డ్రైవర్ ని కూడా పంపించేయడం.. తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం జరిగిందని ఎంపీ వివరించారు. ఈ సమయంలో అతికష్టం మీద కోటీ డెబ్బై అయిదు లక్షలు ఇప్పించడం జరిగిందని ఎంపీ తెలిపారు.
ఈ సమయంలో కిడ్నాప్ సంఘటన తెలిసిన అనంతరం పోలీసులు కేవలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకోవడం జరిగిందని.. విశాఖలో ప్రజలంతా సుఖ సంతోషాలతోనే ఉన్నారని, పూర్తి రక్షణలోనే ఉన్నారని ఎంపీ తెలిపారు.
కిడ్నాప్ లు, హత్యలు, దోపిడీలు అనేవి ప్రతీ గవర్న మెంట్ లోనూ జరుగుతాయని.. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా జరిగాయని ఎంపీ గుర్తు చేశారు. ఇదే క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో కూడా దేశవ్యాప్తంగా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని ఎంపీ వివరించారు. అదే విధంగా హైదరాబాద్ కేంద్రంగా ప్రతీరోజూ హత్యలు, దోపిడీలూ జరగడం లేదా అని ఎంపీ ప్రశ్నించారు.
ఇదే సమయంలో 2004లో నక్సల్స్ చంద్రబాబు వాహనాన్ని పేల్చల్చిన విషయాన్ని ఎంపీ గుర్తు చేసిన ఆయన... టీడీపీ ప్రభుత్వంలోనే అరకు ఎమ్మెల్యేని చంపిన సంఘటనను గుర్తు చేసి, చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇది జరిగిందనే విషయాన్ని నొక్కి చెప్పారు.
విశాఖ భద్రతపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. విశాఖలో భద్రత లేదంటూ కొందరు కొత్త పాట పాడుతున్నారని.. విశాఖలో ఎలాంటి లా & ఆర్డర్ సమస్యలూ లేవని ఎంపీ నొక్కి చెప్పారు.
అనంతరం గత రెండు రోజులుగా తన వ్యాపారం విషయంలో వస్తోన్న కథనాలపై ఎంపీ స్పందించారు. తాను తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు ఎప్పుడో తీసుకుని వెళ్లిపోయానని, ఈ సంఘటన వల్ల కాదని, అది కూడా కేవలం మీడియా వల్లేనని ఎంపీ వివరించారు. తాను ఎంపీ కావడం వల్ల హైదరబాద్ కి ఇప్పటికే వెళ్లిపోయానని తెలిపారు.
తాను విశాఖ ఎంపీ అయిన తర్వాత.. అధికార పార్టీ ఎంపీ అయిన తనకు పనులు చేయించుకోవడం పెద్ద ఇబ్బంది కాదని.. కాకపోతే అలాంటి అపవాదులు తనపై రాకుండా ఉండటం కోసమే తాను ముందుగానే హైదరాబాద్ కి వెళ్లిపోయాయని ఎంపీ వివరించారు. ఇకపై వ్యాపారం హైదరాబాద్ నుంచి చేస్తూ.. రాజకీయాలు మాత్రం విశాఖ కేంద్రంగా చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఇతర రాజకీయ పార్టీ నేతల కామెంట్లపై ఘాటుగా స్పందించారు ఎంపీ. ముందుగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేవనెత్తిన అంశాలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సుమారు 50 గంటల పాటు తన కుమారుడు, సుమారు 30 గంటల పాటు తన భార్య ప్రాణాపాయ స్థితిలో కిడ్నాప్ వ్యవహారంలో ఇబ్బందులు పడితే.. వాళ్లను పోలీసులు రక్షిస్తే.. ఇందులో ఏదో అనుమానం ఉందని, కుట్ర కోణం ఉందని, రాజకీయ కోణం ఉందని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించడంపై ఎంపీ ఫైరయ్యారు. వాడో పిచ్చి కుక్క అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు!
ఇదే సమయంలో స్థానిక నేత విష్ణుకుమార్ రాజుపై కూడా ఎంపీ విమర్శలు గుప్పించారు. తన కుటుంబంలో జరిగిన ఇంత విషాద సంఘటనపై మాట్లాడే క్రమంలో నేరస్థుడి బ్యాక్ గ్రౌండ్ పై స్పందించకుండా .. అతడు గతంలో ఎంత పెద్ద నేరస్థుడే ఆలోచించకుండా... ఇందులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అనుమానాలు ఉన్నాయి అన్నట్లుగా విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ... పైగా ఇంటిఒచ్చి పరామర్శిస్తానని చెప్పడంపై ఎంపీ ఫైర్ అయ్యారు. తన ఇంటికి వస్తానని చెప్పిన విష్ణుకుమార్ రాజుకి.. అవసరం లేదని కాల్ చేయించినట్లు తెలిపారు.
ఇదే సమయంలో ఎర్ర గంగిరెడ్డితో తనకు సంబంధాలు ఉన్నట్లుగా కూడా వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు ఎంపీ ఎంవీవీ. అసలు ఎర్రగంగిరెడ్డిని తానెప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదని.. ఆయనెక్కడో చిత్తురులోనో, తిరుపతిలోనో ఉంటే తాను విశాఖలో ఉంటానని.. విమర్శలకు కూడా ఎంతో కొంత అర్ధం పర్ధం ఉండాలని సూచించారు.
ఇదే సమయంలో ఈ కేసులో ఏ1 గా ఉన్న హేమంత్ అనే వ్యక్తితో తనకు ఇంతవరకూ పరిచయం లేదని.. అవసరమైతే గత ఐదేళ్లలో తన ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చని... కుదిరితే సీబీఐ ఎంక్వైరీ కూడా వేయొచ్చని ఎంపీ వివరించారు. అనంతరం తన వ్యాఖ్యలు మీడియా పూర్తిగా వక్రీకరిస్తుందని.. తన వ్యాపారాలు విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలించడానికి మీడియానే కారణం అని ఎంపీ వివరించారు.
తన కుటుంబంపై జరిగిన కిడ్నాప్ అంశంపై పవన్ కల్యాణ్ బాగానే మాట్లాడారని ఎంపీ సత్యనారాయణ అన్నారు. అదే తానైతే ఎన్ కౌంటర్ చేసే వాడినన్న పవన్ వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు. కష్టం ఎవరికొచ్చినా కష్టమేనని,. కుటుంబాలు వేరు, రాజకీయాలు వేరని అన్నారు. తన కుటుంబం కిడ్నాప్ అంశంపై సీబీఐ విచారణకు సిద్ధమేనని ఎంపీ ఎంవీవీ స్పష్టం చేశారు.