Begin typing your search above and press return to search.

విశాఖ భూ కుంభకోణం: ముగిసిన సిట్ విచారణ .. ఏం తేలిందంటే ?

By:  Tupaki Desk   |   9 Dec 2020 5:10 AM GMT
విశాఖ భూ కుంభకోణం: ముగిసిన సిట్ విచారణ .. ఏం తేలిందంటే ?
X
ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టింది. అదే వ్యవహారం పై మరోసారి సమగ్ర దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింద. ఈమేరకు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి విజయ కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిణి వై.వి.అనూరాధ, రిటైర్డ్ జిల్లా సెషన్స్‌ జడ్జి టి.భాస్కర్ ‌రావులను సభ్యులుగా నియమించింది. టీడీపీ ప్రభుత్వం విశాఖ భూ అక్రమాలపై ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించగా, అది నివేదిక సైతం అందజేసింది.

రెవెన్యూ రికార్డులు, వెబ్‌ ల్యాండ్‌ లో ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వేతర భూములుగా మార్చిన అన్ని కేసులను దర్యాప్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాజీ సైనికోద్యోగులు, రాజకీయ బాధితులకు ప్రభుత్వమిచ్చిన భూముల విక్రయానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యవహారం, ప్రభుత్వ భూముల కబ్జా, ఆక్రమణ కేసులను దర్యాప్తు చేయాలని సూచించింది.

ఇకపోతే , తాజాగా విశాఖ భూ అక్రమాలపై సిట్ దర్యాప్తు ముగిసింది. టీడీపీ హయాంలో రికార్డుల తారుమారు, ఎన్‌ వోసీ జారీ, నిషేధిత భూముల్లో అక్రమాలపై పూర్తిస్థాయిలో సిట్ నివేదిక సిద్ధమయ్యింది. సిట్‌ నివేదిక ఏం తేలుస్తుందోనని పలువురు నేతల్లో టెంక్షన్ నెలకొంది. సిట్‌ కార్యాలయానికి కేటాయించిన 19 మంది రెవెన్యూ సిబ్బందిని చైర్మన్ వెనక్కి పంపించారు. వచ్చే వారంలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని సిట్‌ చైర్మన్ విజయ్‌ కుమార్‌ చెప్పారు. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, అన్ని విషయాలు నివేదికలో స్పష్టంగా పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు.