Begin typing your search above and press return to search.

గీతం 'భవనాల్ని' కూల్చేస్తున్నారు.. కారణం ఇదేనట!

By:  Tupaki Desk   |   24 Oct 2020 4:15 AM GMT
గీతం భవనాల్ని కూల్చేస్తున్నారు.. కారణం ఇదేనట!
X
ఏపీలోని అత్యుత్తమ ప్రైవేటువర్సిటీల్లో ఒకటి గీతం వర్సిటీ. విశాఖపట్నంలోని సాగర్ నగర్ కు కూతవేటు దూరంలో ఉండే ఈ వర్సిటీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. తాజాగా.. ఈ వర్సిటీకి చెందిన కట్టడాల్ని విశాఖ మహానగర సంస్థ అధికారులు కొట్టేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ కట్టడాల్ని కూల్చివేయటంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు వర్సిటీ ప్రధాన ద్వారా.. ప్రహరీ గోడలోని కొంతభాగం.. సెక్యూరిటీ గదుల్ని మున్సిపల్ సిబ్బంది కూల్చేశారు. అనధికారికంగా.. ప్రభుత్వ స్థలాల్లో అక్రమించిన కట్టడాల్ని మాత్రమే తాము కూలుస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా.. ఎలా కొట్టివేస్తారని ప్రశ్నిస్తున్నారు వర్సిటీ సిబ్బంది.

జేసీబీలు.. బుల్ డోజర్లను తీసుకొచ్చి వర్సిటీలో అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తున్న కట్టడాల్ని కూల్చేస్తున్నారు. గీతం వర్సిటీకి చెందిన కట్టడాల్ని కూల్చేస్తున్న నేపథ్యంలో.. బీచ్ రోడ్డులోని అన్ని రకాల రవాణాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ.. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాల్ని నిర్మిస్తే.. ముందుగా నోటీసులు ఇచ్చి.. తర్వాత కూల్చేయాల్సిందని.. అందుకు భిన్నంగా ఇలా కూల్చేస్తారా? అంటూ గీతం వర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.