Begin typing your search above and press return to search.
భారత్ లో కరోనా... ఎన్నెన్ని రకాలో తెలుసా?
By: Tupaki Desk | 3 Jun 2020 3:56 PM GMTప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్... ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ విస్తరిస్తోందన్న విషయం కాప్తంత ఆలస్యంగా తెలిసినా... దాని రూపాంతరాలపై ఇప్పుడు ఓ పక్కా అవగాహన అయితే వచ్చేసింది. దేశంలో ఇప్పటిదాకా 2 లక్షల మందికి పైగా సోకిన ఈ వైరస్... ఏకంగా 198 రకాలుగా మారిపోయిందట. ఈ మేరకు ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దేశంలో విస్తరించిన కరోనా వైరస్... ఏకంగా తన రూపాన్ని 198 రకాలుగా మార్చుకున్న వైనం చూస్తుంటే.. ఇంకా భవిష్యత్తులో ఈ వైరస్ ఇంకెన్ని రకాలుగా మారుతుందోనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదిక ప్రకారం కరోనా వైరస్ మన దేశంలో ఇప్పటిదాకా 198 రకాలుగా రూపాంతరం చెందిందట. ఈ రూపాంతరాల్లో తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఏకంగా 55 రకాలుగా కరోనా రూపాంతరం చెందిందట. అదే దేశ రాజధాని ఢిల్లీలో 39 రకాలుగా, గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ లో 60 రకాలు, గాంధీ నగర్ లో 13 రకాలు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 15 రకాలుగా ఈ వైరస్ రూపాంతరం చెందిందట. ఇక మన దేశంలో విస్తరించిన కరోనా వైరస్ లో 400 రకాల జన్యు క్రమాలను గుర్తించారట. ఈ 400 రకాల జన్యు క్రమాలను పరిశీలించిన జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా... కరోనా వైరస్ ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందిందని తేల్చేసింది.
ఇలా ఎప్పటికప్పుడు తన రూపును మార్చుకుంటూ సాగుతున్న కరోనా... మన శాస్త్రవేత్తలు కనిపెడుతున్న ఏ వ్యాక్సిన్ లొంగకుండా స్వైర విహారం చేస్తోందట. ఏదేని వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు దాని జన్యు క్రమమే ఆదారమని చెప్పాలి. అయితే కరోనా వైరస్ ఏకంగా 400 రకాల జన్యు క్రమాలను మార్చుకుంటూ సాగుతోన్న నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే... మన దేశంలో కనిపించిన 198 రకాల కరోనా వైరస్ రూపాల్లో,.. ఆ వైరస్ పుట్టిన చైనాతో పాటు యూరప్ లకు చెందిన రకాలే అత్యథికంగా ఉన్నట్లుగా కూడా తేలింది.