Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో వైరస్ టెస్టులకు బ్రేకులు.. కారణం ఇదే
By: Tupaki Desk | 25 Jun 2020 2:00 PM GMTతెలంగాణలో రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న తరుణంలో హైదరాబాద్ లో వైరస్ టెస్టులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ, రేపు (గురు, శుక్రవారం) వైరస్ టెస్టులు నిలిపివేస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు ప్రకటించినట్లు సమాచారం. హైదరాబాద్, పొరుగున ఉన్న జిల్లాల్లో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, ఆశించిన రీతిలో టెస్టులు జరగడం లేదు. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో నేడు, రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత మళ్లీ టెస్టులు ప్రారంభమయ్యే అవకాశముంది. వైరస్ టెస్టులు పెంచాలని కేసీఆర్ సర్కారు ను హైకోర్ట్ ఆదేశించింది. దీంతో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 16 వరకు రాష్ట్రంలో 44,341 టెస్టులు చేయగా.. 5406 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 24 నాటికి 67,318 టెస్టులు చేయగా.. 10,444 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇకపోతే , తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కేసులు పదివేలు దాటాయి. బుధవారం ఒక్కరోజే 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 225కి పెరిగింది.