Begin typing your search above and press return to search.

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు పాజిటివ్ !

By:  Tupaki Desk   |   4 July 2020 11:00 AM IST
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు పాజిటివ్  !
X
తెలంగాణలో వైరస్ మహమ్మారి విజృంభన అప్రతిహతంగా కొనసాగుతోంది. చిన్న..పెద్ద.. తేడా లేకుండా వైరస్ వీర విహారం చేస్తుంది. అలాగే రాష్ట్రంలో వరుసగా ప్రజాప్రతినిధులు వైరస్ భారిన పడుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యేకు కూడా పాజిటివ్ అని తేలింది. ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పరీక్షలు చేయించుకోగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆమె యశోద ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు.

ఇప్పటికే ఐదుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వ్యాధికి గురయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వదలకపోవడంతో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. మరోవైపు ఆమె భర్త మహేందర్ రెడ్డి శాంపిల్స్ కూడా సేకరించారు. అతని పరీక్ష వివరాలు రావాల్సి ఉంది. సునీతకు పాజిటివ్ అనే విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలతోపాటు అభిమానులు, అనుచరులు టెన్షన్ ‌లో ఉన్నారు. ముందు జాగ్రత్తగా సునీతా కుటుంబ సభ్యులనుఅధికారులు క్వారంటైన్ చేశారు. ఆమె నివాస ప్రాంతాల్లో శానిటైజేషన్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తన అభిమానులకు సునీత ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వైరస్ ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం చేస్తున్నారని , ఆ లక్ష్మీనరసింహ స్వామి దయవల్ల పూర్తి ఆరోగ్యంతో తాను త్వరలోనే ఇంటికి చేరుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు.