Begin typing your search above and press return to search.
జపాన్ పేరిట కొత్త యాపారం.. ఆ కార్డు మెడలో ఉంటే కరోనా దరికి చేరదట
By: Tupaki Desk | 27 July 2020 4:15 AM GMTశతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని ఊరికే అనలేదేమో. ఇప్పుడు నడుస్తున్న కరోనా కాలానికి తగ్గట్లు.. కొత్త ప్రచారంతో సొమ్ము చేసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇమ్యునిటీ బూస్టర్లు అని చెప్పి కొందరు.. అయుర్వేదం పేరుతో టానిక్ లు తయారు చేశాం.. ఇది తాగితే కరోనా రాదని చెప్పేటోళ్లు.. హోమియోపతి పేరుతో చిన్న గోళీలు సిద్ధం చేసి.. ఐదు రోజుల పాటు వేసుకుంటే.. ఇక అంతే కరోనా వచ్చే అవకాశమే లేదనటం..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రచారాలు మార్కెట్లోకి వచ్చేశాయి.
జనాల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో సరికొత్త ప్రచారం మొదలైంది. మెడలో ‘వైరస్ షట్ అవుట్’ కార్డు వేసుకుంటే కరోనా దగ్గరకు రాదన్న ప్రచారం మొదలైంది. దీనికి సంబంధించిన కార్డు ఒకటి ఏపీలోని అనంతపురం జిల్లాలో అమ్ముతున్నారు. ఈ కార్డును మెడలో వేసుకుంటే నెల రోజుల పాటు కరోనా వైరస్ దగ్గరకే రాదని చెప్పి అమ్ముతున్నారు.
అదెలా అంటే.. కార్డులోపల సోనియం క్లోరైడ్.. న్యాచురల్ జియోలైట్ రసాయన మిశ్రమం ఉంటుందని..కార్డు శరీరానికి వలయంగా మారి రక్షణ ఇస్తుందని చెబుతున్నారు. మెడలో కార్డు వేసుకుంటే మీటరు దూరం వరకూ కార్డు ప్రభావంతో కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదని కొత్త తరహా ప్రచారానికి తెర తీశారు. దీన్ని జపానోళ్లు తయారు చేశారంటూ.. అందుకు తగ్గట్లు ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో సిద్ధం చేశారు.
రూ.300లకు అమ్ముతున్న ఈ కార్డుల్ని.. భయంతో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున కొంటున్నారు. ప్రజల్లోని భయాన్నిసొమ్ము చేసుకోవటం చేస్తున్న దందాగా దీనని పలువురు అభివర్ణిస్తుంటే.. ఏమో.. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అంటూ పెద్దఎత్తున కొనేయటం ఈ మధ్యన ఎక్కువైందట. ఒకవేళ అదే నిజమైతే.. వేలాది కోట్లు ఖర్చు పెట్టే బదులు.. ఈ కార్డుల్ని ఉత్పత్తి చేసి.. ప్రజలంతా మెడలో ఈ కార్డు తప్పనిసరిగా వేసుకోవాలని ప్రభుత్వాలు చెప్పేవిగా? అప్పుడు ఈ తిప్పలే ఉండేవి కావు కదా?