Begin typing your search above and press return to search.

అప్పుడే జన్మించిన ముగ్గురు కవలపిల్లలకు పాజిటివ్ !

By:  Tupaki Desk   |   24 Jun 2020 11:30 PM GMT
అప్పుడే జన్మించిన ముగ్గురు కవలపిల్లలకు పాజిటివ్ !
X
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా అందరినీ మృత్యువు తో పోరాడేలా చేస్తుంది. ఈ వైరస్ రక్కసి తాజాగా తల్లి గర్భంలో కూడా ప్రవేశించింది. అక్కడ కూడా పిల్లలకు రక్షణ కరువైంది.

మెక్సికోలో అప్పుడే జన్మించిన ముగ్గురు కవలల తో పాటు తల్లి కి వైరస్ పాజిటివ్ అని వైద్యులు నిర్థారించారు. అయితే ఆ పిల్లలకు వైరస్ సోకడం పై వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. శాన్ లూయిస్ పోటోసి రాష్ట్రం లోని ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. ఆమె ముగ్గురు కవలలకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మగవారు కాగా, ఒక ఆడబిడ్డ అని వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉంటే.. ఒక మగ పిల్లవాడు మాత్రం శ్వాస తీసుకో వడానికి ఇబ్బంది పడుతున్నాడని వైద్యులు తెలిపారు. ముగ్గురు బిడ్డల తో పాటు తల్లి కి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు.

అయితే , అప్పుడే పుట్టిన పిల్లలకు వైరస్ సోకడం అనేది చాలా అరుదని… అది కూడా ముగ్గురు పిల్లలకు ఒకేసారి పాజిటివ్ అని రావటం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన ఘటన అని అంటున్నారు వైద్యులు. అయితే తల్లిగర్భంలో వైరస్ సోకిందా లేదా ఇతరుల ద్వారా వైరస్ సోకిందా అని వైద్యులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం తల్లి పిల్లలను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.