అదంటే చాలాఇష్టం...హాస్పిటల్ నుండి పారిపోయిన కరోనా రోగి !

Mon Jul 13 2020 19:00:09 GMT+0530 (IST)

That's what he like ... virus patient who escaped from the hospital!

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దేశంలో నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ తరుణంలో కరోనా రోగులతో ఆసుపత్రిలు ఫుల్ అవుతున్నాయి. అయితే ఏవేవో కారణాలతో కరోనా వైరస్ సోకి హాస్పిటల్ లో జాయిన్ అయిన వారు క్వారంటైన్ సెంటర్ల నుండి కొందరు పారిపోతున్నారు. కరోనా హాస్పిటల్స్ లో సరైన సౌకర్యాలు లేవని కొందరుసరైన ఆహారం పెట్టలేదని మరికొందరు ఇంకా ఏవేవో రకరకాల కారణాలతో మరి కొందరు హాస్పిటల్స్ నుండి పారిపోతున్నారు. తాజాగా ఆగ్రాలో మరో కరోనా పేషేంట్ ఆసుపత్రి నుండి పారిపోయాడు. ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.ఈ ఘటన గురించి పూర్తిగా చూస్తే .. తాజాగా ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. అతనికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అతన్ని ఎస్ ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతనికి పాన్ అంటే చాలా ఇష్టంమట. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హాస్పిటల్ నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని సిబ్బంది ఎవరూ గమనించలేదు. లాక్ డౌన్ కారణంగా ఆస్పత్రి పరిసరాల్లో ఎలాంటి షాపులు ఓపెన్ చేయలేదు. దీంతో ఆ కరోనా రోగి గాంధీ నగర్ వెళ్లాడు. అక్కడ ఓ షాపులో పాన్ తీసుకుని తిన్నాడు. అనంతరం అక్కడున్న తన బంధువుల ఇంటికెళ్లి.. తనను ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించండి అని కోరాడు. అయితే వారు చేసేదేమి లేక పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు వైద్యులు వచ్చి అతన్ని తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.