Begin typing your search above and press return to search.

ఓ కరోనా బాధితుడి కన్నీటి కథ.. కదిలిస్తోంది

By:  Tupaki Desk   |   9 July 2020 4:20 AM GMT
ఓ కరోనా బాధితుడి కన్నీటి కథ.. కదిలిస్తోంది
X
ఓ కరోనా బాధితుడి కన్నీటి కథ అందరినీ కదిలిస్తోంది. కన్నీరు పెట్టిస్తోంది. కరోనా సోకితే ఎంత దుర్భర స్థితి ఎదురవుతుంది? సమాజం ఎలా వెలివేస్తుంది.. భార్య, పిల్లల పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందనేది కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చాడు. అతడి గాథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అంబర్ పేట ప్రాంతానికి చెందిన ప్రైవేట్ సంస్థ ఉద్యోగి పాజిటివ్ నుంచి కోలుకొని బయటపడ్డాడు. అతడు తనకు ఎదురైన అనుభవాలు చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి మొదట జ్వరం రాగానే ఆస్పత్రికెళ్లి పరీక్షలు చేసుకున్నాడు. కరోనా అని తెలియగానే భార్య, తన ఇద్దరు చిన్న పిల్లలను కళ్లారా చూసుకొని బతుకుతానో లేదోనని భారంగా బయలుదేరాడు. బ్యాంకు అకౌంట్, బాకీలు వివరాలు భార్యకు వివరించాడు. ఏటీఎం పిన్ నంబర్, సెల్ ఫోన్ పాస్ వర్డ్, బ్యాంకు ఖాతాల వివరాలు, ఉద్యోగం చేస్తున్న పీఎఫ్ వివరాలు ఇలా అన్నీ భార్యకు చెప్పాడు. కరోనాతో కోలుకుంటానో.. చనిపోతానో అన్న భయం అతడిని ఈ పనులు చేసేలా చేసింది. అది చూసి భార్య కన్నీరు కార్చడం ఆ ఉద్యోగి తట్టుకోలేకపోయాడు.

ఇక గాంధీలో చికిత్స తీసుకొని బతుకుజీవుడా అంటూ సదురు ఉద్యోగి బయటపడ్డాడు. తొలిరోజు లేటుగా ఆస్పత్రికి వెళ్లినందుకు కనీసం ఆహారం కూడా వాళ్లు పెట్టలేదు. ఇలా బయటపడి దేవుడి దయతో ఇంటికి వస్తే ఆ గల్లీ వాసులు ఈ ఉద్యోగిని కుటుంబాన్ని వెలివేశారు. ఇంటిపక్కవాళ్లంతా ఖాళీ చేసి వెళ్లిపోయారట.. కార్పొరేటర్ ఇంట్లోంచి బయటకు రావద్దని.. కిటీకీలు తెరవద్దని స్పష్టం చేశారట.. ఇలా కరోనాను జయించిన ఓ వ్యక్తి జీవిత గాథ ఇప్పుడు అందరినీ కంటతపడి పెట్టిస్తోంది.

తొలుత జ్వరం.... ఆ తర్వాత కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్తున్నప్పుడు అతని ఆలోచనలు, మానసిక సంఘర్షణలు... ఆస్పత్రిలో వైద్యం అందిన తీరు... కోలుకొని ఇంటికి వచ్చాక ఇరుగుపొరుగు వారు పలకరించకపోగా అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వైనం.... ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక వ్యక్తి సంఘర్షణ కన్నీళ్లు పెట్టించక మానదు.. ఇలాంటి ఎన్నో ఘటనలకు కారణమవుతోంది కరోనా.. సో అందరూ జాగ్రత్తగా ఉండడమే ఇప్పుడు అసలు పని అని స్పష్టమవుతోంది.