Begin typing your search above and press return to search.

ఏపీలో తగ్గని కేసులు.. ఈరోజు కొత్తగా 4074

By:  Tupaki Desk   |   20 July 2020 8:00 PM IST
ఏపీలో తగ్గని కేసులు.. ఈరోజు కొత్తగా 4074
X
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4074 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53724కి చేరింది.

ఏపీలో యాక్టివ్ కేసులు 28800 ఉండగా.. 24228 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 696మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

గత 24 గంటల్లో 33580 కరోనా పరీక్షలను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1086 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 596, కర్నూలులో 559 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి.. గుంటూరు జిల్లాల్లో 9మంది చొప్పున కరోనాతో మరణించారు.

కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు.. చిత్తూరు శ్రీకాకుళం, విశాఖల్లో ఐదుగురు.. కర్నూలు.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మృతిచెందారు.