Begin typing your search above and press return to search.

కేసుల్లో ప‌దివేల‌కు చేరువ‌లో ఏపీ: తాజాగా 462 పాజిటివ్‌

By:  Tupaki Desk   |   23 Jun 2020 2:00 PM GMT
కేసుల్లో ప‌దివేల‌కు చేరువ‌లో ఏపీ: తాజాగా 462 పాజిటివ్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేసుల న‌మోదులో మ‌రో రికార్డు నెల‌కొల్పేలా ఉంది. వ‌రుస‌గా కేసులు పెరుగుతుండ‌డంతో రేప‌టితో ఏపీలో కేసుల సంఖ్య ప‌ది వేలు దాటే అవ‌కాశం ఉంది. తాజాగా 443 పాజిటివ్ కేసులు న‌మోదతో పాటు 8మంది మృత్యువాత ప‌డ్డారు. తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం కేసులు 9,834 చేరాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 407 మంది ఉండ‌గా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 40 మంది, విదేశాల నుంచి వచ్చిన 15 మంది ఉన్నారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 20,369 మందికి పరీక్షలు నిర్వహించగా 462 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక 129 మంది వైర‌స్‌ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జయ్యారు. కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందినవారు మృతి చెందిన వారిలో ఉన్నారు. వైర‌స్ నుంచి కోలుకున్న వారు మొత్తం 4,592 మంది ఉండ‌గా, మ‌ర‌ణించిన వారి సంఖ్య 119 మంది.

ప్రస్తుతం ఏపీలో 5,123 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో తూర్పుగోదావరి 87, అనంతపురం 68 జిల్లాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. అనంతపురము జిల్లాలో వైర‌స్ ఉధృతి తీవ్రంగా ఉంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 870కి చేరుకుంది. దీంతో నివార‌ణ చ‌ర్య‌లు క‌ట్టుదిట్టం చేస్తున్నారు.