Begin typing your search above and press return to search.
కంప్యూటర్లకు కొత్త వైరస్...వెరీ డేంజరస్
By: Tupaki Desk | 5 Jun 2017 2:09 PM GMTకంప్యూటర్ వినియోగదారులకు వైరస్‌ల బెడద ఇప్పట్లో తప్పేలా లేదు. మొన్నా మధ్యే వన్నాక్రై వైరస్ పంజా విసరగా కొన్ని కోట్ల కంప్యూటర్లు దాని బారిన పడ్డాయి. దీంతో ఇంకా ఆ నష్టాన్ని పూడ్చుకునే పనిలోనే కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ పని ఇంకా ముగియకముందే మరో కొత్త వైరస్ అటాక్ అయిందని చెక్ పాయింట్ అనే ఐటీ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఇండియా-బ్రెజిల్- అమెరికా వంటి దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్ దాదాపుగా 25 కోట్ల కంప్యూటర్లకు ఇప్పటికే వ్యాప్తి చెందిందని చెక్ పాయింట్ వెల్లడించింది.
కొత్తగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను 'ఫైర్ బాల్ (Fireball)' అని పిలుస్తున్నారు. ఇది కూడా వన్నాక్రై లాగే ఓ మాల్ వేర్ వైరస్. కానీ వన్నాక్రై లా యూజర్ ఫైల్స్‌ను లాక్ చేయదు. కాకపోతే యూజర్ కంప్యూటర్ లో ఉన్న ఇంటర్నెట్ బ్రౌజర్లను హ్యాక్ చేస్తుంది. దీంతో ఆ బ్రౌజర్లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ మారిపోతుంది. ఈ క్రమంలో యూజర్ ఆ సెట్టింగ్ ను ఛేంజ్ చేసినా అది మారదు. అంతేకాకుండా ఒకసారి ఈ వైరస్ పీసీలోకి చొరబడితే హ్యాకర్లకు అది బ్యాక్ డోర్ సృష్టిస్తుంది. దీంతో ఏ పీసీలో ఉన్న డేటాను అయినా హ్యాకర్లు తస్కరించగలరు. అవసరం అనుకుంటే రిమోట్ గా ఏ ఫైల్ నైనా - కోడ్ నైనా యూజర్ పీసీలోకి పంపగలరు. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. విలువైన సమాచారం హ్యాకర్లకు చేరుతుంది.
ఫైర్ బాల్ మాల్ వేర్ వైరస్ ను తయారు చేసింది చైనాకు చెందిన హ్యాకర్లే అని బీజింగ్ కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ రాఫొటెక్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 25 కోట్లకు పైగా కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయని ఆ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి 5 కార్పొరేట్ నెట్ వర్క్ లలో ఒక నెట్ వర్క్‌కు చెందిన కంప్యూటర్లలో ఈ వైరస్ చొరబడిందని తెలిపింది. ఇందులో అమెరికాకు చెందిన కంప్యూటర్లే ఎక్కువగా ఉన్నాయట. ఆ తరువాత స్థానాల్లో ఇండియా, బ్రెజిల్ కంప్యూటర్లు ఉన్నట్టు తెలిసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/