జీఎస్‌ఎల్ హాస్పిటల్ నుండి రిమాండ్ ఖైదీ కరోనా పేషేంట్ పరార్ !

Mon Aug 03 2020 20:00:23 GMT+0530 (IST)

virus Patient ranaway from GSL Hospital!

ఏపీలో రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతిరోజూ కూడా రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో లక్షా 60 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాను అరికట్టడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా కంట్రోల్ అవ్వడంలేదు. దేశంలో ఏ రాష్ట్రం లో చేయని విదంగా ప్రతిరోజూ కూడా రికార్డ్ స్థాయిలో కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తుండటంతోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.అలాగే కొందరు చేసే తప్పుల వల్ల కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నా కూడా అది ఇతరులకి ప్రమాదం అని తెలిసినా కూడా అధికారులకి చెప్పి ఐసోలేషన్ లోకి వెళ్లకుండా బయట తిరుగుతున్నారు. అలాగే మరికొందరు కోవిద్ సెంటర్స్ ను వైద్యులు కళ్లు కప్పి పారిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాజమండ్రిలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. రాజానగరం జీఎస్ ఎల్ హాస్పిటల్ నుంచి కరోనా పేషెంట్ పరారయ్యాడు. పరారైన వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన రాజానగరం పోలీసులు పరారైన కరోనా పేషెంట్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 8555 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 158764 కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో ఏపీలో 67 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1474కి పెరిగింది