Begin typing your search above and press return to search.

టెన్షన్ వస్తుంది కానీ.. సెకండ్ వేవ్ ఎప్పటివరకో చెప్పిన ప్రముఖుడు

By:  Tupaki Desk   |   12 May 2021 6:30 AM GMT
టెన్షన్ వస్తుంది కానీ.. సెకండ్ వేవ్ ఎప్పటివరకో చెప్పిన ప్రముఖుడు
X
వారంలోకి వచ్చేశాం. కనుచూపు మేర కొత్త కేసుల నమోదు విషయంలో ఎక్కడా వెనకడుగు పడని పరిస్థితి. లాక్ డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి ఒకలా.. రాష్ట్రాలు అనుసరిస్తున్నవిధానం మరోలా ఉండటంతో.. గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరికైతే తీవ్రత తెలిసి.. నొప్పిగా ఫీల్ అవుతూ.. ఒత్తిడిని తట్టుకోలేని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు.. ఇలాంటి అవకాశం ఇవ్వకుండా అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదన్నట్లుగా ముందస్తుగా కఠిన చర్యలు తీసుకుంటూ.. తమ రాష్ట్రాల్లో కేసుల నమోదును కట్టడి చేస్తున్న రాష్ట్రాలు లేకపోలేదు.

ఇంతకీ.. వణికిస్తున్న సెకండ్ వేవ్ ఎప్పటివరకు ఉంటుంది? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై ప్రముఖ వైరాలజిస్టు షాహీద్ జమీల్ కీలక వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం ఆయన అశోక వర్సిటీలో త్రివేదీ స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రెండో వేవ్ తీవ్రస్థాయికి చేరిందని.. ఇప్పుడే దీని తగ్గుబాటును అంచనా వేయటం తొందరపాటు అవుతుందన్నారు.

తాజాగా ఒక మీడియా సంస్థ నిర్వహించిన ఒక ఆన్ లైన్ సదస్సులోపాల్గొన్న ఆయన.. సెకండ్ వేవ్ ఎప్పటివరకు ఉంటుందన్న అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక అంచనా ప్రకారం జులై వరకు సెకండ్ వేవ్ సాగుతుందన్న షాకింగ్ మాటను చెప్పారు. అంటే.. ఇంచుమించు మరో మూడు నెలల పాటు అన్న మాట. అది కూడా కచ్ఛితమేమీ కాదు.. అంచనా మాత్రమే.

మొదటి వేవ్ మాదిరి క్రమపద్ధతిలో ఉండదని.. సెకండ్ వేవ్ తీరు భిన్నమన్నారు. డిసెంబరు నాటికి కేసుల సంఖ్య భారీగా తగ్గిందని.. దీంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరగటం.. పెళ్లిళ్లు.. ఎన్నికల ర్యాలీలు.. మత కార్యక్రమాలతో వైరస్ వ్యాప్తిని పెంచాయన్నారు. టీకా సరిగా పని చేయటం లేదన్న వార్తలు కూడా సెకండ్ వేవ్ వ్యాప్తికి కారణమైందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. చాలాదేశాలు టీకాల్ని ముందుస్తుగా బుక్ చేసుకోగా.. భారత్ ఆ విషయంలో వెనుకబడిందన్న వ్యాఖ్య ఆయన నోటి నుంచి వచ్చింది. సో.. సెకండ్ వేవ్ మరో మూడు నెలలు తప్పదన్నట్లే.